ఘనంగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ

 

ఘనంగా పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి  మహోత్సవ పతాకావిష్కరణ

విశాఖ అగ్రపీఠం మధురవాడ విచారణ లో గల  పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి దేవాలయంలో పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి మహోత్సవ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవము తేది 4-10-2023 బుధవారం నాడు జరగనున్నది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా  పాల్గొన్న  విశాఖ అతిమేత్రాసన ఆధ్యాత్మిక గురువులు, వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి గారిచే పతాకావిష్కరణ జరిగింది.  గురుశ్రీ దుగ్గింపూడి బాలశౌరి గారు మాట్లాడుతూ  "సమస్తమును విడిచిపెట్టి క్రీస్తును అనుసరించు” అన్న సువార్త వాక్కు పునీత ఫ్రాన్సిస్ గారి  జీవితంలో అక్షర సత్యమైనది అని . అదేవిధంగా మనమందరము ప్రభు యేసు క్రీస్తు ని  మార్గం లో నడవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విశ్వాసులు , గురువులు, మఠకన్యలు, సలహా సంఘ పెద్దలు, యువతీ యువకులు పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
విచారణ గురువులు గురుశ్రీ  ప్రకాష్ గారు  'పునీత అస్సీసీపుర ఫ్రాన్సిస్ వారి పండుగ మహోత్సవమునకు ప్రజలను , విశ్వాసులను  ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.