ఇద్దరు సిస్టర్స్ మరియు ఫాదర్ల పై మళ్ళీ దాడి
ఇద్దరు సిస్టర్స్ మరియు ఫాదర్ల పై మళ్ళీ దాడి
ఛత్తీస్‌గఢ్‌లో సన్యాసినులను అరెస్టు చేసి జైలులో పెట్టిన ఘటన మరువక ముందే మరో హింసాత్మక సంఘటన నమోదైంది. ఈసారి ఒడిశాలోని జలేశ్వర్ లో దాడి జరిగింది. నివేదికల ప్రకారం, దాదాపు 70 మంది బజరంగ్ దళ్ సభ్యులు ఇద్దరు కతోలిక ఫాదర్లు మరియు ఇద్దరు సిస్టర్స్ (Nuns)లను మరియు ఒక ఉపదేశుడిని మత మార్పిడులకు పాల్పడ్డారని తప్పుడు ఆరోపణలు చేస్తూ దాడి చేశారు.
ఆగస్టు 6న జలేశ్వర్ విచారణకర్తలు ఫాదర్ లిజో నిరప్పెల్ మరియు బాలసోర్ మేత్రాసనంలోని జోడా విచారణకు చెందిన ఫాదర్ వి. జోజో గార్లు గంగాధర్ మిషన్ స్టేషన్‌లో" స్మారక ప్రార్థనలు" నిర్వహించారు. ఇద్దరు సిస్టర్స్ లు మరియు ఒక ఉపదేశుడితో కలిసి, ఆ బృందం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గ్రామానికి చేరుకుంది. గ్రామస్తులు కోరిక మేరకు, తమ పొలాల నుండి తిరిగి వచ్చిన తర్వాత, సాయంత్రం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. గురువులు మరియు సిస్టర్స్ దివ్యబలి పూజ అనంతరం భోజనాలను ముగించుకుని రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు గ్రామం నుండి బయలుదేరుతుండగా ఈ దాడి జరిగింది.
సమయంలో పెద్ద సంఖ్యలో బజరంగ్ దళ్ సభ్యులు ఆ ప్రదేశానికి చేరుకుని వారి వాహనాన్ని అడ్డుకుని వారిపై దాడి చేసారు. దాదాపు 45 నిమిషాల పాటు అక్కడ వున్నవారిని భయబ్రాంతులకు గురిచేస్తూ ఉద్రిక్తత వాతావరణాన్ని సృష్టించారని తెలిసింది.
ఈ దాడి కి సంబంధించి ఫాదర్ లిజో గారు మాట్లాడుతూ "గ్రామానికి అర కిలోమీటరు దూరంలో, ఇరుకైన అటవీ ప్రాంతంలో, దాదాపు 70 మంది బజరంగ్ దళ్ సభ్యుల గుంపు వేచి ఉంది," అని "వారు మొదట మోటార్ సైకిల్ పై ఉన్న మా ఉపదేసుడిని లక్ష్యంగా చేసుకున్నారు. వారు అతన్ని కనికరం లేకుండా కొట్టారు అని తెలిపారు".
ఆ తర్వాత దాడి చేసిన వారు ఫాదర్ ల వాహనాన్ని అడ్డుకుని, బలవంతంగా ఆపి, మతపరమైన దూషణలకు పాల్పడ్డారు.
“వారు మాపై భౌతికంగా దాడి చేశారు - నెట్టడం, లాగడం, తీవ్రంగా కొట్టడం. వారు మమ్మల్ని కొట్టారు, మా మొబైల్ ఫోన్‌లను లాక్కున్నారు, మరియు మేము వారిని మార్చడానికి ప్రయత్నిస్తున్నామని అరుస్తూనే ఉన్నారు అని ఫాదర్ లిజో గుర్తుచేసుకున్నారు.
బజరంగ్ దళ్ సభ్యులతో పాటు మీడియా సిబ్బంది కూడా తీసుకు వచ్చి ఆ బృందం మతపరమైన దూషణలు చేసిందని మరియు మతమార్పిడి చేశారని తప్పుడు ఆరోపణలు చేసిందని ఫాదర్ ఆరోపించారు. "ఇది ప్రణాళికాబద్ధంగా జరిగిన దాడి," అని ఫాదర్ లిజో అన్నారు. "వారు తమ సొంత మీడియాను ఉపయోగించి కథనాన్ని సృష్టించారు అని తెలిపారు.
సంఘటన జరిగిన దాదాపు 45 నిమిషాల తర్వాత, ఒక మహిళా కానిస్టేబుల్ మరియు ఇద్దరు పురుష అధికారులతో సహా పోలీసు అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. అయితే, పోలీసుల సమక్షంలో కూడా, బజరంగ్ దళ్ సభ్యులు వారి దాడులను కొనసాగించారు.
ఫాదర్ వి. జోజో ఈ అసంకల్పిత దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. "నేను కేవలం ప్రార్థన సేవ చేయడానికి వచ్చాను. ఇంత శాంతియుతంగా మరియు పవిత్రంగా చేసినందుకు ఇంత వ్యతిరేకత వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు" అని ఆయన అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer