ఘనంగా క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవము

ఘనంగా క్రీస్తు రక్షకుని యాత్ర మహోత్సవము

విశాఖ అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, రక్షణగిరి పుణ్యక్షేత్రంలో నవంబర్17, ఆదివారం నాడు "క్రీస్తు రక్షకుని యాత్రమహోత్సవ" పండుగ ఘనంగా జరిగింది. విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ మరియు పునీత పేతురు ప్రధాన దేవాలయ విచారణకర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన అపోస్తలిక పాలనాధికారి మహా పూజ్య డా|| పొలిమెర జయరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇతర గురువులతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. మహా పూజ్య పొలిమెర జయరావు గారు అమూల్యమైన దైవ సందేశాన్ని ప్రజలకు అందించారు. ఈ ప్రపంచానికి ఏసుక్రీస్తు ప్రభువు దయచేసిన రక్షణ ప్రణాళికను గురించి వాక్యానుసారంగా మహా పూజ్య పొలిమెర జయరావు గారు వివరించారు.

విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. బైబిల్ క్విజ్, ఇతర పోటీలలో గెలిచిన వారికీ పీఠాధిపతులు బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దుగ్గంపూడి బాలశౌరి గారు,అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు , ప్రొక్యూటర్ గురుశ్రీ జయరాజు గారు, గురుశ్రీ సానబోయిన శౌరిబాబు గారు , గురుశ్రీ సరిస ప్రతాప్ గారు, గురుశ్రీ మరియారత్నం గారు, గురుశ్రీ రవితేజ గారు, గురుశ్రీ ఒమ్మి మోహన్ ప్రసాద్,గురుశ్రీ జీవన్ బాబు, గురుశ్రీ హరీ ఫిలిప్స్ ,గురుశ్రీ మరియాదాస్, గురుశ్రీ బాలరాజు, గురుశ్రీ యేసు మరియు ఇతర విచారణల నుండి సుమారు 150 మంది గురువులు, 30 మందికి పైగా సిస్టర్స్ పాల్గొన్నారు. వేలమంది క్రైస్తవులు ఈ వేడుకలకు హాజరయ్యారు. దివ్య బలి పూజలో పాల్గొని, ఏసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాదాలు పొందారు.

సహాయ విచారణ కర్తలు గురుశ్రీ వినయ్ కుమార్, గురుశ్రీ అంతోని రాజ్, పిపిసి అధ్యక్షులు శ్రీ ముసురు రాజేష్ బాబు కమిటీ, శ్రీ బూర రవీంద్ర శేషుబాబు గారి ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ కమిటీ, మరియు ఇతర భక్త సంఘాలు చక్కని ఏర్పాట్లు చేశాయి.

విచారణ కర్తలు గురుశ్రీ జొన్నాడ ప్రకాశ్ గారు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer