క్రీస్తురాజుపురంలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం

క్రీస్తురాజుపురంలో భక్తిశ్రద్ధలతో మ్రాని కొమ్మల ఆదివారం
విశాఖ అతిమేత్రాసనం క్రీస్తురాజు పుణ్యక్షేత్రం, క్రీస్తురాజుపురం, ఎర్ర సామంత వలస గిరిజన విచారణలో మ్రాని కొమ్మల ఆదివారం భక్తిశ్రద్ధలతో జరిగింది. యర్రసామంతవలస విచారణ కర్తలు ఫాదర్ పి. జీవన్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికసంఖ్యలో విశ్వాసులు, విచారణ ప్రజలు పాల్గొన్నారు. యేసు ప్రభువువారు యెరూషలేములో ప్రవేశించినపుడు, అతనికి ముందు వెనుక వచ్చిన జనసమూహము, “దావీదు కుమారా! హోసాన్న! అని చేసిన విజయ ధ్వానములు గుర్తు చేసుకుంటూ ప్రతిఒక్కరు మ్రాని కొమ్మలను పట్టుకొని గురువులతో కలసి పాదయాత్రగా దేవాలయం చేరుకున్నారు.ఈ కార్యక్రమంలో ఫాదర్ జయరాజు గారు పాల్గొని తన సహాయాన్ని అందించారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు.
ఫాదర్ పి. జీవన్ బాబు గారు మ్రాని కొమ్మల ఆదివారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసారు.విశ్వాసులకొరకు ప్రత్యేక ప్రార్థనలు చేసారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer