క్రిస్మస్ సిద్దపాటుగా గ్రామాల్లో మొదలైన దీపారాధనలు
క్రిస్మస్ సిద్దపాటుగా గ్రామాల్లో మొదలైన దీపారాధనలు
క్రిస్మస్ పండుగ సిద్దపాటు సందర్భముగా గ్రామాల్లో మేలుకొలుపులు, దీపారాధన లు ప్రారంభమయ్యాయి.
కతోలిక విశ్వాసులు క్రిస్మస్ పండుగకు సిద్దపడుతూ తెల్లవారు జామున 2 గంటలకు లేచి ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ భక్తి కార్యక్రమములో పాల్గొంటారు. క్రీస్తు మన కోసం పుట్టారు, ఆయనను స్వీకరించుట కు సిద్దపడండి అనే సందేశాన్ని గ్రామాల్లో క్రొవ్వొత్తులు చేతబూని, స్తుతి గీతాలు పాడుతూ, ఆ గ్రామాలను తిరిగి ప్రకటిస్తారు. గ్రామములలోనే కాకుండా సిటీలలో కూడా మేలుకొలుపులు, దీపారాధనలు భక్తియుతంగా నిర్వహిస్తున్నారు. ఒక్కొక రోజు ఒక్కొక ఏరియా మీదుగా విశ్వాసులను కలుపుకొంటూ 9 రోజులపాటు ఈ దీపారాధన సాగుతుంది.
పాప సంకీర్తనలు చేసి, దివ్య బాలయేసు భజన గీతాలు ఆలపించి,ప్రార్థనలు చేసి, దివ్య పూజాబలి లో పాల్గొని, ప్రత్యేక క్రిస్టమస్ సందేశాలను ఆలకించి దేవుని దీవెనలు పొందుతారు. ఈ విధంగా సిద్ధపడి క్రిస్టమస్ పండుగ ఘనంగా జరుపుకుంటారు.
తడికెలపూడి, యర్ర సామంత వలస గిరిజన విచారణ, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, రాజాం ,వీరఘట్టం, వెంగాపురం తదితర గ్రామాలు , విజయనగరం, సామర్లకోట, విశాఖపట్నం లోని జ్ఞానాపురం , మహారాణిపేట, కైలాసపురం వాటి ప్రాంతాలలో కూడా ఈ మేలుకొలుపులు, దీపారాధనలు భక్తియుతంగా సాగుతున్నాయి.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer