అల్జీరియా రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్

గురువారం జులై 24 ఉదయం వాటికన్‌లో అల్జీరియా రిపబ్లిక్ అధ్యక్షుడు Abdelmagjid Tebbounను పోప్ లియో కలిసారు
పోప్‌తో సమావేశమైన తర్వాత, అల్జీరియా రిపబ్లిక్ అధ్యక్షుడు హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్ మరియు రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల విభాగం బహుళ పక్ష విభాగానికి అండర్ సెక్రటరీ మోన్సిగ్నోర్ Daniel Pachoను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది
"స్టేట్ సెక్రటేరియట్‌లో జరిగిన స్నేహపూర్వక చర్చలలో భాగంగా హోలీ సీ మరియు అల్జీరియా రిపబ్లిక్ మధ్య దౌత్య సంబంధాల గురించి మాట్లాడారు అని ప్రకటన పేర్కొంది
ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి, అలాగే ప్రపంచంలో శాంతి మరియు సోదరభావాన్ని నిర్మించడంలో మతాంతర సంభాషణ మరియు సాంస్కృతిక సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది అని ప్రకటన పేర్కొంది