అమృతవాణి ని సందర్శించిన చైర్మన్ మహా పూజ్య డాక్టర్ పొలిమెర జయరావు

చైర్మన్ మహా పూజ్య డాక్టర్ పొలిమెర జయరావు

అమృతవాణి ని సందర్శించిన చైర్మన్ మహా పూజ్య డాక్టర్ పొలిమెర జయరావు

27 జూన్ 2024 న అమృతవాణి చైర్మన్ మహా పూజ్య డాక్టర్  పొలిమెర జయరావు గారు అమృతవాణి ని సందర్శించారు. ఉదయం 9 గంటలకు అమృతవాణి చేరుకున్న ఆయనను అమృతవాణి డైరెక్టర్ గురుశ్రీ పప్పుల సుధాకర్ గారు అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ సిబ్బందితో కలిసి సాదరంగా ఆహ్వానించారు.

మహా పూజ్య డాక్టర్ పొలిమెర జయరావు గారు అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ కార్యకలాపాలను గూర్చి తెలుసుకున్నారు. అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగంలో జరుగుతున్న కార్యక్రమాలను ఆయన తెలుసుకున్నారు. కార్యచరణలలో తీసుకురావలసిన మార్పులను గూర్చి ఆయన సిబ్బందితో చర్చించి మార్గదర్శకాలను నిర్దేశించారు.

అమృతవాణి మరియు రేడియో వెరితాస్ ఆసియ తెలుగు విభాగం వారు చేస్తున్న సువార్త సేవకు వారిని అభినందించారు. ఇలానే మరిన్ని కార్యక్రమాలను చేపట్టి సంఘాన్ని దైవ మార్గంలో నడిపించాలని చెప్పారు.