సెయింట్ జాన్ హెన్రీ న్యూమాన్ను Doctor of the Church ప్రకటించనున్న పోప్ లియో గారు

సెయింట్ జాన్ హెన్రీ న్యూమాన్ను Doctor of the Church ప్రకటించనున్న పోప్ లియో గారు 

పరిశుద్ధ లియో XIV పాపు గారు సెయింట్ జాన్ హెన్రీ న్యూమాన్ను నవంబర్ 1వ తేదీన ప్రపంచ విద్యా దినోత్సవం సందర్భంగా Doctor of the Churchగా ప్రకటిస్తారు.ఈ గౌరవం, వేదాంతశాస్త్ర పునరుద్ధరణకు మరియు క్రైస్తవ సిద్ధాంతాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా లభిస్తుంది.

సెప్టెంబర్ 28న కేటెచిస్టుల జూబ్లీ కోసం జరిగిన దివ్యబలి పూజ అనంతరం పరిశుద్ధ లియో XIV పాపు గారు  మాట్లాడుతూ, సెయింట్ న్యూమాన్ "వేదాంతశాస్త్రం పునరుద్ధరణకు మరియు క్రైస్తవ సిద్ధాంత అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి నిర్ణయాత్మకంగా దోహదపడ్డారని" అన్నారు.

సెయింట్ న్యూమాన్ ఫిబ్రవరి 21, 1801న లండన్లో జన్మించారు. ఈయన ఆంగ్ల కతోలిక  వేదాంతి, విద్యావేత్త, తత్వవేత్త, చరిత్రకారుడు, రచయిత మరియు కవి గా ప్రసిద్ధి గాంచారు.  1845లో క్యాథలిక్ అయ్యారు, 1879లో పరిశుద్ధ లియో XIII వ పాపు గారి చేత కార్డినల్గా నియమించబడ్డారు. మరియు 1890లో ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ సమీపంలోని ఎడ్జ్బాస్టన్లో మరణించారు.

 

Article and designed By 

M kranthi Swaroop