"మన ఉమ్మడి గృహం - మన బాధ్యత" - పొప్ లియో

"మన ఉమ్మడి గృహం - మన బాధ్యత" - పొప్ లియో
వాతావరణ - న్యాయం పై అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి పరిశుద్ధ 14 వ లియో పాపు గారు ప్రసంగిస్తూ మన ఉమ్మడి ఇంటిని మనం చూసుకుంటామా అని దేవుడు మనల్ని అడుగుతారని అన్నారు.
"రైజింగ్ హోప్ ఫర్ క్లైమేట్ జస్టిస్" అనే సమావేశం అక్టోబర్ 1-3 తేదీ వరకు కాస్టెల్ గాండోల్ఫోలో జరుగుతున్నది. 1,000 మందికి పైగా మత పెద్దలు, వాతావరణ నిపుణులు మరియు రాజకీయ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ రాసిన ' లౌడాటో సి' పత్రిక 10వ వార్షికోత్సవాన్ని కూడా కొనియాడనున్నారు. ఈ సందర్భముగా పరిశుద్ధ 14 వ లియో పాపు గారు ఒక మంచు దిమ్మెను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం పరిశుద్ధ 14 వ లియో పాపు గారు రైజింగ్ హోప్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. గత దశాబ్దపు విజయాలను గుర్తుచేసుకుంటూ, గుర్తించిన సవాళ్లు రాజకీయంగా మరియు సామాజికంగా మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికంగా కూడా ఉన్నాయని, పోప్ ఫ్రాన్సిస్ గారు "హృదయ మార్పిడి"(A conversion of heart)గా అభివర్ణించిన దానికి పిలుపునిచ్చాయని ఆయన లియో పాపు గారు అన్నారు.
హృదయం "లోతైన శోధన జరిగే ప్రదేశం అని , దేవుని పై విశ్వాసం మరియు ప్రేమ ద్వారా ప్రేరేపించబడిన జీవనశైలికి" మారడం నిజమైన పర్యావరణ మార్పిడి అని ఆయన అన్నారు.
చివరిగా దేవుడు సృష్టించిన ప్రపంచాన్ని మనం సాగు చేసి, శ్రద్ధ వహించామా, మరియు మన సహోదర సహోదరీలను మనం జాగ్రత్తగా చూసుకున్నామా అని దేవుడు మనల్ని అడుగుతాడు. మన సమాధానం ఏమిటి? అని పరిశుద్ధ 14 వ లియో పాపు గారు అడిగారు.
బుధవారం పోప్ లియో XIV ప్రసంగించనున్న సమావేశానికి ముందు, కాలిఫోర్నియా మాజీ గవర్నర్ మరియు టెర్మినేటర్ ఫిల్మ్ ఫ్రాంచైజీ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ వాటికన్ న్యూస్ తో మాట్లాడారు.శ్రీసభ యొక్క విస్తృత పరిధి గురించి మాట్లాడుతూ, 1.4 బిలియన్ కతోలికులు కలిగి ఉన్నామని ,మనకు మన ఉమ్మడి గృహణి ని నయం చేయగల సమిష్టి సామర్థ్యం ఉంది అని అయన అన్నారు.
ఈ విషయాన్ని తెలియజేయగల ఈ బహుమతిని దేవుడు నాకు ఇచ్చాడు అని, నాకు సంకల్పం ఉంది, మరియు నేను దానిని చూడగలను మరియు దీనిని మెరుగైన ప్రపంచంగా మార్చడానికి నేను చేయగలిగినదంతా చేస్తాను" అని మిస్టర్ స్క్వార్జెనెగర్ గారు అన్నారు.
Article and design By
M kranthi swaroop