మెరుగైన ప్రపంచాన్ని నిర్మిద్దాం - పోప్ లియో సందేశం

మెరుగైన ప్రపంచాన్ని నిర్మిద్దాం - పోప్ లియో సందేశం
ఆగస్టు 3, 2025న టోర్ వెర్గాటాలో "యువత జూబ్లీ" సందర్భముగా పది లక్షలకు పైగా యువత హాజరయ్యారు. ఈసందర్బాముగా లక్షలాది మంది యువ కాథలిక్కులకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించమని పరిశుద్ధ పోప్ లియో గారు చెప్పారు.
యువతని ఉద్దేశించి మాట్లాడుతూ శిష్యులలో తమను తాము చూసుకోవాలని , వారిలాగే, చాలామంది భయంతో లేదా నిరాశతో నడుస్తారు కానీ పునరుత్థానమైన క్రీస్తులో ఆశను కనుగొంటారు అని పరిశుద్ధ పోప్ లియో XIV గారు అన్నారు
దివ్యబలి పూజ సందర్భముగా పరిశుద్ధ పోప్ లియో XIV గారు మాట్లాడుతూ యువతను "గొప్ప విషయాలను, పవిత్రతను కోరుకోవాలని" మరియు "స్నేహం నిజంగా ప్రపంచాన్ని మార్చగలదు అని , స్నేహం శాంతికి మార్గం అని అన్నారు.
ఈ సందర్భముగా ఆయన బ్లెస్డ్ పియర్ జార్జియో ఫ్రాస్సాటి మరియు బ్లెస్డ్ కార్లో అకుటిస్‌లను యవ్వన పవిత్రతకు నమూనాలుగా చూపారు. ప్రార్థన మరియు ఉదారమైన ప్రేమ, ముందుకు సాగడానికి సరైన మార్గమని ఆయన అన్నారు.
లిస్బన్‌లో జరిగిన ప్రపంచ యువజన దినోత్సవంలో పరిశుద్ధ పోప్ ఫ్రాన్సిస్ గారి సందేశాన్ని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. "మనం ఉన్నతమైన దానికోసం పిలువబడ్డాము" అని ఆయన అన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer