'పర్యావరణ నష్టం' గురించి ఆందోళన చెందుతున్న ఐరిష్ మిషనరీ

 'పర్యావరణ నష్టం' గురించి ఆందోళన చెందుతున్న ఐరిష్ మిషనరీ

మయన్మార్ , కచిన్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన  కుండపోత వర్షాలు మరియు తీవ్రమైన వరదలు  వల్ల  భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పంటలు నాశనమయ్యాయి .మైత్కినా ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో నివాసితులను ఖాళీ చేయించారు.

ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం జూలై 17 నాటికి ఇటీవలి కురిసిన వర్షాలకు ,వరదలకు భారతదేశంలోనే 100 మందికి పైగా మరణించారు, నేపాల్‌లో 100 మందికి పైగా మరణించారు మరియు ఆఫ్ఘనిస్తాన్‌లో దాదాపు 40 మంది మరణించారు.

దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో వలె, సుదీర్ఘమైన మరియు కుండపోత వర్షం కారణంగా  ఐరావతి నది ప్రమాద రీతిలో  పారుతుంది. మైత్కినాలోని లోతట్టు ప్రాంతాలలో ఉన్న కమ్యూనిటీలలోకి నీరు చేరింది . రిలీఫ్‌వెబ్ ప్రకారం సుమారు 2,300 కుటుంబాలు లేదా 11,000 మంది ప్రజలను 36 కేంద్రాలకు తరలించాల్సి వచ్చింది.

ఈసారి వరదలు "జీవన స్మృతిలో అత్యంత దారుణంగా  ఉన్నాయి" అని 63 ఏళ్ల గురువు గురుశ్రీ  షెరిడాన్ చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల ఇది మరింత దిగజారిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐరిష్ కొలంబన్ మిషనరీ ఫాదర్ గురుశ్రీ ఎమోన్ షెరిడాన్ గారు యుద్ధం-దెబ్బతిన్న ఈశాన్య మయన్మార్‌లోని కచిన్ రాష్ట్ర రాజధాని మైట్కినాలోని పునర్జన్మ పునరావాస కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆగ్నేయాసియా దేశం యొక్క డ్రగ్స్ మహమ్మారి మధ్య వ్యసనంలో చిక్కుకుని బాధపడుతున్న  పురుషులు మరియు మహిళలకు అయన సహాయం చేస్తున్నారు. ఈ కేంద్రం  యొక్క రికవరీ ప్రోగ్రామ్ హెరాయిన్‌కు బానిసైన వారికి కొత్త జీవితాన్ని అందిస్తుంది.

అయన మాట్లాడుతూ "చాలా అడవులు నరికివేయబడ్డాయి అని , దీనివల్ల  నదిలోకి నీటి ప్రవాహాన్ని పెరుగుతుంది అని,  మరియు పుటావోలోని 'ఐస్ మౌంటైన్' అని పిలుస్తున్న మంచు కొండ కరిగిపోతోంది అని ఐరిష్ మిషనరీ ఒక కొండ పట్టణాన్ని ప్రస్తావిస్తూ చెప్పారు.

మైత్కినా మేత్రాసన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పునరావాస కేంద్రానికి రోజుకు రెండుసార్లు ఆహారం మరియు త్రాగునీటిని పంపిస్తున్నారు అని గురుశ్రీ ఎమోన్ షెరిడాన్ గారు తెలిపారు.

ప్రకృతి వైపరీత్యాలు, పర్యావరణ క్షీణతల వల్ల ఇటువంటి అనర్దాలు జరుగుతున్నాయి అని గురుశ్రీ ఎమోన్ షెరిడాన్ గారు బాధపడ్డారు. 

 


Created By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer