శాంతి చర్చా వేదికను ఏర్పాటు చేసిన కారితాస్ శ్రీలంక
కథోలిక పీఠాధిపతుల సామాజిక అభివృద్ధి విభాగమైన కారితాస్ శ్రీలంక మే 29 నుండి 30 వరకు తమ దేశ శాంతి కొరకు చర్చా వేదికను ఏర్పాటు చేసారు
శ్రీలంకలోని అన్ని వర్గాల మధ్య శాంతి మరియు సామరస్యాన్ని పెంపొందించడానికి మరియు జాతీయ సంభాషణను పెంపొందించడంమే ఈ చర్చా వేదిక లక్ష్యం.
ఈ కార్యక్రమంలో ఐదుగురు ప్రముఖ అతిథి వక్తలు వివిధ కీలకమైన ఇతివృత్తాలను ప్రసంగించారు.
న్యాయవాది మరియు సామాజిక కార్యకర్త SRI హెజాజ్ హిజ్బుల్లా "శ్రీలంకలో చట్ట అమలు మరియు చట్ట ఉల్లంఘన" అనే అంశంపై, రత్నపురా మేత్రాసనానికి చెందిన గురువు గురుశ్రీ హరన్ "హెజెమోనిక్ బ్యాక్‌డ్రాప్" పై, పర్యావరణవేత్త మరియు సామాజిక కార్యకర్త శ్రీ రాహుల థెరో "శాంతి కొరకు పర్యావరణ న్యాయం"పై దృష్టి సారించారు.
న్యాయవాది శ్రీమతి హిమలీ కులరత్న "విక్టిమైజేషన్ మరియు మార్జినలైజేషన్: శాంతి మరియు సామాజిక సమన్వయానికి అడ్డంకులు" అనే అంశంపై మాట్లాడారు
చివరగా, పీపుల్స్ యాక్షన్ ఫర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహన హెట్టియారాచ్చి "శ్రీలంకలో ఎన్నికలు మరియు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు" అనే అంశంపై ప్రసంగించారు.
వివిధ సంఘాలు మరియు మత విశ్వాసాల నుండి పాల్గొనేవారు ఈ ముఖ్యమైన సంభాషణకు హాజరయ్యారు మరియు సహకరించారు. "కలిసి, మనం మరింత శాంతియుతమైన మరియు సామరస్యపూర్వకమైన శ్రీలంకను నిర్మించగలము" అని ఫాదర్ హరన్ అన్నారు.
ఈ కార్యక్రమానికి కాథలిక్ ఏజెన్సీ ఫర్ ఓవర్సీస్ డెవలప్‌మెంట్ (CAFOD) మరియు డెవలప్‌మెంట్ కోఆపరేషన్ కోసం జర్మన్ కాథలిక్ బిషప్స్ ఆర్గనైజేషన్ అయిన MISEREOR నిధులు సమకూర్చాయి.