కుటుంబం నమ్మికకు మూలమన్న పోప్ లియో

Latin American and Caribbean Episcopal Council(CELAM) వారి నేతృత్వంలో జూబ్లీ మరియు సినడల్ సమావేశంలో భాగంగా, పోప్ లియో కుటుంబ విలువ మరియు నిరీక్షణ    జూబ్లీ అర్ధాన్ని వివరించారు.

ఈ జూబిలీ సందర్బంగా మన తల్లిదండ్రుల నుండి మనం పొందిన విశ్వాసాని, మన పెద్దవారు జపమాలను జపిస్తూ మనకోసం వారు చేసే నిరంతర ప్రార్థనను, వారి సరళమైన, వినయపూర్వకమైన మరియు నిజాయితీగల జీవితాలతో ఎన్నో కుటుంబాలను మరియు సమాజాలను పోషించని దానిని మనం ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి అని పొప్ అన్నారు 

నేటి కుటుంబాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మరియు కుటుంబ గౌరవాన్ని ప్రభావితం చేసే కొన్ని ప్రధాన సమస్యలను పొప్ గుర్తుచేశారు.

నిరుద్యోగం,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు ప్రాప్యత లేకపోవడం, అత్యంత దుర్బలత్వం, వలసలు, యుద్ధాలకు సంబంధించిన సమస్యలు పేదరికానికి కారణం అని పోప్ అన్నారు . 

కుటుంబ జీవితాన్ని మరియు సభ్యులకు విద్యకు మద్దతు ఇచ్చే సమాజంలోని అంశాలను ప్రోత్సహించడానికి మరియు బలోపేతం చేయడానికి మార్గాలను అన్వేషించాల్సిన బాధ్యత ప్రభుత్వ సంస్థలు మరియు శ్రీసభకు ఉంది అని పోప్ అన్నారు.

కుటుంబం ఒక బహుమతి మరియు ఒక ముఖ్యమైన బాధ్యత అని గుర్తు చేస్తూ పోప్ లియో ముగించారు