పొండోగ్ పినోయ్ 20వ వార్షికోత్సవ వేడుక

జూన్ 25న ఫిలిప్పీన్స్‌లోని ఇమస్ మేత్రాసన పుణ్యక్షేత్రం మరియు ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ పిల్లర్ విచారణలో "పొండోగ్ పినోయ్"వారి 20వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు 

పొండోగ్ పినోయ్ వైస్ చైర్‌పర్సన్ మహా పూజ్య రెనాల్డో జి. ఎవాంజెలిస్టా దివ్యపూజాబలి సమర్పించారు.

గురుశ్రీ బెంజమిన్ ఎ. ఫ్రాన్సిస్కో సెయింట్ మార్తా విచారణ గురువు మరియు పొండోగ్ పినోయ్ ప్రోగ్రామ్‌ చైర్‌పర్సన్, మరియు ఇతర మేత్రాసన గురువులు పది మంది గురువులు ఈ పూజలో పాల్గొన్నారు.

పొండోగ్ పినోయ్ నేషనల్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ నుండి ముఖ్యమైన భాగస్వామ్యులు
మిస్టర్ బెబోట్ సబాంగన్ (ప్రమోషన్ ఆఫీసర్), ఎల్మిరా జాయిస్ డి కాస్ట్రో (ఫైనాన్స్ ఆఫీసర్), మరియు జిసెల్ లారోనా (అకౌంటింగ్ క్లర్క్) పాల్గొన్నారు.

సెయింట్ మార్తా విచారణ యువకులు ఈ వేడుకలో సంస్థ లక్ష్యం మరియు విలువలకు ప్రతీకాత్మకమైన పొండోగ్ పినోయ్ "ఇసాంగ్ కుసింగ్ డ్యాన్స్"ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన యువత యొక్క ప్రమేయం మరియు ఉత్సాహాన్ని తెలియపరచింది.

ఫి గార్డా, పొండోగ్ పినోయ్ కోఆర్డినేటర్, హాజరైన వారికి వందలాది బాటిళ్లను పంపిణీ చేశారు, ఇది మేత్రాసనంలో ప్రజలకు సహాయం చేసే వారికి ఒక కొత్త ప్రారంభానికి ప్రతీక.

ఈ పూజాబలి రెండు దశాబ్దాల పొండోగ్ పినోయ్ ప్రయాణానికి నిదర్శనం. విచారణ విశ్వాసులు మరియు మతాధికారులు కూడా తమ అచంచలమైన మద్దతును ప్రదర్శించారు, బలమైన కమ్యూనిటీ స్ఫూర్తిని మరియు దాతృత్వం మరియు సంఘీభావ సూత్రాలకు నిబద్ధతను ప్రదర్శించారు.