విజయవాడలో APFC వార్షిక సర్వసభ్య సమావేశం

2025 మే 27న ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల ( APFC ) సమాఖ్య వార్షిక సర్వసభ్య సమావేశం విజయవాడలోని పీఠాధిపతుల నిలయము నందు జరిగింది.
విజయవాడ పీఠకాపరి, APFC ప్రధాన కార్యదర్శి మహా పూజ్య తెలగతోటి జోసఫ్ రాజారావు సమావేశానికి అధ్యక్షత వహించి ప్రారంభోపన్యాసం అందించారు
కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ మువ్వల ప్రసాద్ నేతృత్వంలో క్రైస్తవ ఐక్యతా ప్రార్థనతో సమావేశం ప్రారంభమైంది.
పోప్ ఫ్రాన్సిస్ ఆత్మశాంతి కోసం మరియు కొత్తగా ఎన్నికైన XIV లియో పోప్ ఫలవంతమైన పరిచర్య కొరకు ప్రార్థనలు చేశారు.
అనుమానాస్పద విషాద ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల కోసం ఒక నిమిషం మౌనం పాటించారు.
2025 జూలై 3న భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని మరియు నైసియా కౌన్సిల్ 1700వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడిగా జరుపుకోవాలని సభ్యులు చర్చించి ప్రణాళిక వేశారు.
చర్చిలలో యుక్తవయస్సు లో ఉన్నవారికి వివిధ నైపుణ్య శిక్షణా ప్రాముఖ్యత గురించి, అలాగే APFC సమర్థవంతంగా పనిచేయడానికి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయవలసిన అవసరం గురించి APFC సలహాదారి శ్రీ జే .ఆర్ . సుధీర్ మాట్లాడారు.
తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC) కార్యనిర్వాహక కార్యదర్శి గురుశ్రీ డాక్టర్ అంతయ్య కొండవీటి జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై పురోగతి గురించి మరియు APFCలో కొత్త సభ్యులను చేర్చుకోవడంపై నిర్వహణ కమిటీ చర్చిస్తుందని మరియు నిర్ణయం త్వరలో తెలియజేయబడుతుందని కూడా ఆయన సభ్యులకు తెలియజేశారు.
క్రైస్తవ సమాజానికి అందుబాటులో ఉన్న వివిధ పథకాల గురించి వివరించి,చర్చీలు వాటిని ఉపయోగించుకోవాలని క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ MD శ్రీ అమర్లపూడి శేఖర్ కోరారు.
మైనారిటీ కమిషన్ యాక్టింగ్ చైర్మన్ శ్రీ జాషువా డానియల్, జూన్ 14న క్రైస్తవుల ఐక్యతను సమావేశం నిర్వహించబడుతుందని,సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
నెల్లూరు మేత్రాసన నూతన సహపీఠకాపరి, FTC చైర్మన్ మహా పూజ్య పిల్లి అంతోని దాస్ వివిధ అభిప్రాయాలను వినడానికి సంతోషించారు మరియు తన ముగింపు ప్రసంగంలో క్రైస్తవ ఐక్యత ప్రాముఖ్యతపై మాట్లాడారు.
మహా పూజ్య జోసెఫ్ రాజారావు ప్రార్థన మరియు ఆశీర్వాదంతో సమావేశం ముగిసింది.
ఈ సమావేశానికి సహాయసహకారాలను అందించిన కార్యనిర్వాహక కార్యదర్శులు గురుశ్రీ
మువ్వల ప్రసాద్ మరియు గురుశ్రీ కరుణానిధికి FTC అభినందనలు తెలియచేసింది .