కంబోడియాలో 8వ బౌద్ధ-క్రైస్తవ అంతర్జాతీయ సంగోష్ఠి

మే 27-29, 2025 వరకు కంబోడియాలో,నమ్ పెన్లో ( Phnom Penh ) ఎనిమిదవ బౌద్ధ-క్రైస్తవ అంతర్జాతీయ సంగోష్ఠి ఘనంగా జరిగింది
అంతర్మత సంవాద మండలి, కంబోడియాలోని బౌద్ధ విశ్వవిద్యాలయాలు మరియు మఠాలతో పాటు, కంబోడియా పీఠాధిపతుల సమాఖ్య వారి నేతృత్వంలో నిర్వహించబడింది
"సయోధ్య మరియు స్థితిస్థాపకత ద్వారా శాంతి కొరకు బౌద్ధులు మరియు క్రైస్తవులు కలిసి పనిచేయడం" అనే ఇతివృత్తంపై ఈ సంగోష్ఠిని నిర్వహిస్తున్నారని హోలీ సీ ప్రెస్ ఆఫీస్ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఆసియా మరియు ఇతర ప్రాంతాల నుండి సుమారు 150 మంది క్రైస్తవ మరియు బౌద్ధ మతానికి చెందినవారు కంబోడియా రాజధాని నగరానికి చేరుకున్నారు
వీరు 16 దేశాలు మరియు Federation of Asian Bishops’ Conferences (FABC) ప్రతినిధులు
"శాంతి సేవలో బౌద్ధులు మరియు క్రైస్తవుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడం మరియు సహకారాన్ని బలోపేతం చేయడం" లక్ష్యంగా ఈ సంగోష్ఠి జరిగింది
ఈ అంతర్జాతీయ సమావేశం Maha Ghosanand వారసత్వ భూమిలో జరుగుతునందున, పవిత్రమైన గ్రంథాలు, ఆధ్యాత్మిక బోధనలు మరియు జీవిత అనుభవాలు ద్వారా సంఘర్షణ మరియు హింసతో నిండిన ప్రపంచానికి స్వస్థత మరియు నిరీక్షణను అందిస్తాయని హోలీ సి ఆశాభావం వ్యక్తం చేసింది
7 వ బౌద్ధ-క్రైస్తవ అంతర్జాతీయ సంగోష్ఠి నవంబర్ 13-16, 2023 న థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరిగింది.