వాలిబాల్ పోటీలు నిర్వహించిన దివ్యబాలయేసు విచారణ.

కర్నూలు మేత్రాసనం, నంద్యాల జిల్లా, మంచాలకట్ట విచారణ, జనవరి 14 వ తేదీన దివ్యబాల యేసు పండుగ పురస్కరించుకొని విచారణ గురువులు గురుశ్రీ తోట జోసఫ్ గారు 12,13 యువతీయువకులకు వాలిబాల్ పోటీలు నిర్వహించారు.

కర్నూలు, నంద్యాల నుండి సుమారు 28 జట్లు ఈ పోటీలలో పాల్గొన్నారు.

పెద్దకొట్టాల విచారణ కర్తలు గురుశ్రీ ఎరువ జోజిరెడ్డి గారు ఈ పోటీలను ప్రారంభించారు.

ఈ పోటీలలో పాల్గొన ప్రతిఒక్కరికి అమృతవాణి తెలుగు బైబిల్ డైరీని బహుమతిగా ఇచ్చి దేవుని యొక్క అడుగుజాడలో ముందుకు సాగాలని ప్రోత్సహించారు     

Tags