హింసను అంతం చేయాలని పిలుపునిచ్చిన పోప్ లియో

జూలై 29 డిజిటల్ మిషనరీలు మరియు కాథలిక్ ఇన్ఫ్లుయెన్సర్లు జూబ్లీ దివ్యబలిపూజాలో పోప్ లియో XIV బసిలికాలో ఉన్న యువకులను స్పానిష్, ఆంగ్లము మరియు ఇటాలియన్ భాషలలో ప్రసంగించారు.
తన సందేశంలో, హింసను అంతం చేయాలని మరోసారి పిలుపునిస్తూ, "శత్రుత్వం మరియు యుద్ధంతో నలిగిపోతున్న ఈ కాలంలో మనకు శాంతి ఎంత అవసరమో" వివరించారు
శాంతిని ప్రకటించడం శ్రీసభ మరియు జూబ్లీ కోసం రోమ్‌లో గుమిగూడిన వారందరి లక్ష్యం అని ఆయన పునరుద్ఘాటించారు.
"ప్రతిచోటా శాంతిని వెతకాలి, ప్రకటించాలి మరియు పంచుకోవాలి; యుద్ధం యొక్క విషాదకరమైన ప్రదేశాలలో నిరాశతో నిండిన హృదయాలలో శాంతి నింపాలని అన్నారు
కాబట్టి గతంలో కంటే ఎక్కువగా, డిజిటల్ మిషనరీలు ఈ సందేశాన్ని ప్రపంచ నలుమూలలా వ్యాప్తి చేయడం చాలా అవసరమని పోప్ లియో అన్నారు