జ్ఞానస్నానం ద్వారా మనం జీవాన్ని పొందుతామన్న పోప్

సోమవారం జులై 28 ఉదయం రోమ్‌లో యూత్ జూబ్లీ సందర్భంగా ఫ్రెంచ్ విశ్వాస ఆరంభికులును (catechumens ) మరియు నియోఫైట్‌ల బృందాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, 

వారి విశ్వాస ప్రయాణాన్ని మరియు వారి వెంట వచ్చిన పీఠాధిపతులను మరియు ఉపదేశుల ఉనికిని గురించి పోప్ మాట్లాడారు

మీలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్వాగతించే సమాజంలో ప్రభువుతో వ్యక్తిగతంగా కలుసుకుంటారు

జ్ఞానస్నానం కేవలం ఒక ఆచారంగా కాకుండా, జీవమున్న పితా, పుత్ర పరిశుద్ధాత్మతో జీవితాంతం కలిసే ప్రారంభంగా వర్ణించారు. 

 “శ్రీసభకు మీ విశ్వాస సాక్షం అవసరం.” “మీరు భూమికి ఉప్పు మరియు ప్రపంచానికి వెలుగు” అని పోప్ అన్నారు.

హాజరైన యువకులను యేసుకు దగ్గరగా ఉండమని గుర్తు చేస్తూ “మనం క్రైస్తవులుగా పుట్టలేదు; దేవుని కృప మనల్ని తాకినప్పుడు మనం క్రైస్తవులమవుతాము.” అని పోప్ ముగించారు