ప్రతి ఒక్కరూ ఒక ప్రభావశీలి అన్న కార్డినల్ టాగ్లే

జులై 29 Digital Missionaries మరియు Catholic Influencers జూబ్లీలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులతో సెయింట్ పీటర్స్ బసిలికా నిండిపోయింది.
సువార్తికరణ విభాగ ప్రో-ప్రిఫెక్ట్ కార్డినల్ లూయిస్ ఆంటోనియో టాగ్లే దివ్యబలిపూజకు అధ్యక్షత వహించారు.
ప్రతి ఒక్కరూ ఒక ప్రభావశీలి అని, అదే సమయంలో, ప్రతి ఒక్కరూ ప్రభావితులు అవుతారని కార్డినల్ టాగ్లే అన్నారు .
మన కుటుంబాలు, పొరుగు ప్రాంతాలు, పాఠశాలలు మరియు ఇతర సామాజిక విషయాల ద్వారా మనం నిరంతరం ప్రభావితమవుతున్నామని కార్డినల్ అన్నారు
యేసు తన ప్రేమతో మనల్ని ప్రభావితం చేయడానికి అనుమతించాలి తద్వారా మనం ఇతరులను మంచి కోసం ప్రభావితం చేయవచ్చు.
"యేసు మరియు పరిశుద్ధాత్మలోని ప్రేమ మానవ హృదయాలలో మరియు సమాజాలలోకి విషపూరిత ప్రభావాలు ప్రవహించకుండా నిరోధించనివ్వండి "అని కార్డినల్ యాత్రికులను కోరారు