హైదరాబాద్ అతిమేత్రాసనం సెయింట్ మేరీస్ కేథడ్రల్ లో పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. అధిక సంఖ్యలో మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
హైదరాబాద్ అతిమేత్రాసనం పునీత జోజప్ప గారి దేవాలయం, బొల్లారం విచారణలో తపస్సు కాల ప్రత్యేక దివ్య బలిపూజ భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ వేలంటైన్ డిమెల్లో గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం విచారణలో తపస్సు కాల పాప పరిహార పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనా కూడిక భక్తిశ్రద్ధలతో జరిగింది. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
శ్రీకాకుళం మేత్రాసనం సహాయమాత దేవాలయంలో మార్చి 14 న పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. మేత్రాసన గురువులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
1972 లో అంతర్జాతీయ వినియోగదారుల సంఘాల సంస్థ ప్రాంతీయ సంచాలకుడు అన్వర్ ఫజల్ గారు మార్చి 15 తేదీనే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవంగా పరిగణించాలని తీర్మానించారు .