ఫిబ్రవరి 22న బ్యాంకాక్‌లో జరిగిన ఫెడరేషన్ ఆఫ్ ఆసియన్ బిషప్స్ కాన్ఫరెన్స్ (FABC) సమావేశంలో గోవా మరియు డామావో అగ్రపీఠాధిపతులు భారతీయ కార్డినల్ మహా పూజ్య ఫిలిప్ నెరి ఆంటోనియో సెబాస్టియో డో రోజారియో ఫెర్రో అధ్యక్షులుగా మరియు ఫిలిఫైన్స్,కలూకాన్ పీఠాధిపతులు మహా పూజ్య పాబ్లో విర్జిలియో సియోంగ్కో డేవిడ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోషల్ ఫోరమ్ వారు గుంటూరు మేత్రాసనం, మనోవికాస కేంద్రం పునీత అన్నమ్మ మానసిక వికలాంగుల పాఠశాల వారికి ఫిబ్రవరి 20,2024 న పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం విరాళంగా అందించారు
బెంగళూరు, కర్ణాటక రీజినల్ ఆర్గనైసెషన్ ఫర్ సోషల్ సర్వీస్ (KROSS ) నందు భారత కథోలిక పీఠాధిపతుల సమాఖ్య CBCI న్యాయ, శాంతి, అభివృద్ధి విభాగం వారు జెపిడి కార్యదర్శులకు ఫిబ్రవరి 21 -22 ,2024 రెండు రోజులపాటు సమావేశం నిర్వహించింది.
రాయలసీమ ప్రాంతీయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అఫ్ చర్చిస్ (APFC) కడప జిల్లా యాక్షన్ కమిటీ (DAC) ఏర్పాటుపై 20 ఫిబ్రవరి 2024న కడపలోని క్యాథలిక్ బిషప్ హౌస్‌లో 05.00 నుండి 07.30 గంటల వరకు సంప్రదింపులు జరిపింది.
రెండు కాథలిక్ ఉన్నత విద్యా సంస్థలు-డొమినికన్ వారు నడిపించే యూనివర్శిటీ ఆఫ్ శాంటో టోమస్ (UST) మరియు అటెనియో డి మనీలా విశ్వవిద్యాలయం-ఫిబ్రవరి 13–14, 2024న అర్చకత్వ ( ప్రీస్ట్హుడ్ ) వేదాంతశాస్త్రంపై అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించాయి.