లౌదాతో సి గ్రామాన్ని ప్రారంభించనున్న పోప్ లియో

సెప్టెంబర్ 5, శుక్రవారం రోమ్ సమయం సాయంత్రం 4 గంటలకు, కాస్టెల్ గాండోల్ఫోలోని చారిత్రాత్మక పాపల్ నివాసంలో, పోప్ లియో XIV బోర్గో లాడాటో సి’ని ప్రారంభిస్తారు
సృష్టి సంరక్షణపై పోప్ ఫ్రాన్సిస్ ఎన్సైక్లికల్ పదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ఇది ప్రజల సందర్శనార్థం తెరవబడింది మరియు లౌదాతో సి’ దార్శనికతను రూపొందించడానికి అంకితం చేయబడింది
2023లో లౌడాటో సి’ సెంటర్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్గో - ఇటాలియన్ భాషలో "గ్రామం" అని అర్థం.
ఈ ప్రాజెక్ట్ 135 ఎకరాల తోటలు, విల్లాలు, పురావస్తు ప్రదేశాలు మరియు వ్యవసాయ భూములలో విస్తరించి ఉంది.
ఈ కేంద్రం విద్య, స్థిరత్వం మరియు సమాజ జీవితానికి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చరిత్రను ఏకీకృతం చేస్తుంది.
ఇది కేవలం సందర్శించడానికి ఒక ప్రదేశం కాదు, దేవునితో, ఇతరులతో మరియు సృష్టితో సహవాసంలో జీవించడానికి, ప్రార్థించడానికి అని వివరించారు.
పోప్ ఉరేగింపా ఈ సెంటర్ కి చేరుకుంటారు, ప్రార్థన మరియు పాటల క్షణాలతో నిండి ఉంటుంది. టెనోర్ ఆండ్రియా బోసెల్లి మరియు అతని కుమారుడు మాటియో పోప్ ఆశీర్వాదానికి ముందు కృతజ్ఞతా గీతాన్ని ఆలపించనున్నారు.
ఈ చారిత్రాత్మక సందర్భంగా రోమన్ క్యూరియా ప్రతినిధులు, పౌర నాయకులు మరియు అనేక మంది సహకారులు కూడా హాజరవనున్నారు .