సీషెల్స్ రిపబ్లిక్ అధ్యక్షుడితో సమావేశమైన పోప్ లియో

ఆగస్టు 22 శుక్రవారం ఉదయం వాటికన్‌లో Seychelles రిపబ్లిక్ అధ్యక్షుడు Wavel Ramkalawan పోప్ లియో ను కలిసారు 

పోప్‌తో సమావేశమైన తర్వాత, అధ్యక్షుడు హోలీ సీ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ పియట్రో పరోలిన్‌ మరియు హోలీ సీ రాష్ట్రాలతో సంబంధాల అండర్ సెక్రటరీ మోన్సిగ్నోర్ Mirosław Stanisławను కలిసినట్లు హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది 

"స్టేట్ సెక్రటేరియట్‌లో జరిగిన సుహృద్భావ చర్చల సందర్భంగా, హోలీ సీ మరియు సీషెల్స్ రిపబ్లిక్ మధ్య దౌత్య సంబంధాల గురించి మాట్లాడారు అని ప్రకటన పేర్కొంది

ప్రస్తుత దేశ రాజకీయ మరియు సామాజిక-ఆర్థిక పరిస్థితి మరిముఖ్యంగా శ్రీసభ సహకారంతో  "పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ మరియు విద్య గురించి, ద్వీపసమూహంలోని యువత ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించారు 

ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తపరచడం, "దేశాల మధ్య సంభాషణ మరియు సహకారాన్ని ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను చర్చించినట్లు  హోలీ సీ ప్రెస్ ఆఫీస్ పేర్కొంది