కోవిడ్ మహమ్మారి తరువాత చైనా అంటేనే ప్రపంచమంతా భయపడుతుంది. తాజాగా చైనా లో పిల్లలలో న్యుమోనియా (శ్వాసకోశ సంబంధిత) కేసులు ఎక్కువవుతున్నాయి అని తెలిసి ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది.
పాకిస్తాన్ కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ (పిసిబిసి)కి కొత్తగా ఎన్నికైన హైదరాబాద్కు చెందిన బిషప్ శాంసన్ షుకార్డిన్ (62) "న్యాయం మరియు శాంతిని" ప్రోత్సహించడానికి పాకిస్తాన్లో దైవదూషణ చట్టాలను సవాలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
"టిసిబిసి - క్రైస్తవ సమైక్య విభాగం మరియు అంతరమత సంవాదం" విభాగ డియోసెసన్ డైరెక్టర్ల సమావేశం నవంబర్ 7 & 8 తేదీల్లో విజయవాడలోని బిషప్ హౌస్లో జరిగింది. విజయవాడ పీఠాధిపతులు మరియు చైర్మన్ మహా పూజ్య టి.జోసెఫ్ రాజారావు గారి అధ్యక్షత ఈ సమావేశం జరిగింది .
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం వణికిస్తోంది. వాయు నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దమ్ము, ధూళి కణాలతో గాలి నిండిపోయింది. విజబులిటీ 500 మీటర్లకు పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పై గాలి నాణ్యత 450పైగా నమోదు అవుతోంది.