క్యాథలిక్ రేడియో స్టేషన్‌ను ఎయిర్‌వేవ్‌ల నుండి తొలిగించిన నికరాగ్వాన్ ప్రభుత్వం
క్యాథలిక్ రేడియో స్టేషన్‌ను ఎయిర్‌వేవ్‌ల నుండి తొలిగించిన నికరాగ్వాన్ ప్రభుత్వం
జూలై 9న, నికరాగ్వా అంతర్గత మంత్రిత్వ శాఖ "రేడియో మారియా" యొక్క చట్టపరమైన హోదాను రద్దు చేసింది. ఇది సెంట్రల్ అమెరికన్ దేశం అంతటా కాథోలిక కంటెంట్‌ను ప్రసారం చేసింది.రేడియో మారియా నికరాగ్వా లో 2000 సంవత్సరం నుండి తమ ప్రసారాలను ప్రారంభించింది. 84 దేశాలలో రేడియో మారియా ప్రసారాలను అందిస్తుంది.
దేశం నుండి పారిపోయిన తర్వాత లేదా బలవంతంగా బహిష్కరించబడిన వారికీ మరియు యూకారిస్ట్ వేడుకలు లేని కాథోలికులకు లకు ఇది ఒక ముఖ్యమైన మాధ్యమంగా పనిచేసింది.
2019 మరియు 2023 మధ్య ఆర్థిక నివేదికలను అందించడంలో రేడియో మారియా విఫలమైందని అంతర్గత మంత్రిత్వ శాఖ పేర్కొంది మరియు దాని బోర్డు పదవీకాలం 2021లో ముగిసిందని ఆరోపించింది.
"రేడియో మారియా" పరిమిత షెడ్యూల్‌ను ప్రసారం చేస్తోంది, అయినప్పటికీ ఆన్‌లైన్‌లో 24 గంటలు ప్రత్యక్ష ప్రసారం చేయబడింది.
దేశంలోని శాండినిస్టా పాలనలోని కాథోలిక స్వరాలను అణచివేయడంతో పాటు వేధింపులకు కూడా దారితీసింది. దాని బ్యాంక్ ఖాతాలు ఏప్రిల్‌లో స్తంభింపజేయబడ్డాయి. గురువులపై నిఘా పెట్టారు మరియు దివ్యబలి పూజ సమయంలో పర్యవేక్షణ మరియు పండుగ ఊరేగింపులు ,ఇతర బహిరంగ మతపరమైన వేడుకలు నిషేధించబడ్డాయి.
దేశంలో కనీసం 16 క్యాథలిక్ మీడియా సంస్థలు మూతబడి ఉన్నాయని, దివ్య బలిపూజ మరియు ప్రార్థనలను మాత్రమే ప్రసారం చేయడం ద్వారా రేడియో మారియా వివాదాస్పద కంటెంట్‌ను నివారించిందని, నికరాగ్వాన్ కాథోలిక దేవాలయాలపై దాడులను డాక్యుమెంట్ చేసే లాయర్ మార్తా ప్యాట్రిసియా మోలినా స్వతంత్ర వార్తాపత్రిక కాన్ఫిడెన్షియల్‌తో అన్నారు.
2018 నుండి కనీసం 131 మంది దేవాలయ సభ్యులు మరియు 91 మంది మహిళలు నికరాగ్వా నుండి పారిపోయారు లేదా బహిష్కరించబడ్డారుఅని ఏప్రిల్‌లో మోలినా చెప్పారు. మహా పూజ్య రోలాండో అల్వారెజ్ గారు కుట్ర మరియు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటి నకిలీ ఆరోపణలపై దోషిగా నిర్ధారించబడి వాటికన్‌కు బహిష్కరించబడ్డారు. అయనతో పాటు మరో 17 మందిని బహిష్కరించారు.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer