క్రైస్తవ సమైక్యతా ఆదివారం 2024

శ్రీ సభ దైవార్చన సంవత్సరంలో 3వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతుంది. భారత దేశంలో ఈ ఆదివారాన్ని 'క్రైస్తవ సమైక్యతా ఆదివారం' గా పాటిస్తున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న  క్రైస్తవ సంఘాలన్నీ సమైక్యంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేస్తునం. జనవరి 18వ తేదీ నుండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ క్రైస్తవ సంఘాలన్నింటితో కలసి క్రైస్తవ సమైక్యత కోసం ప్రత్యేక ప్రార్ధనలు జరుగుతున్నాయి. జనవరి 25వ తేదీన పునీత పౌలుగారి మనోఃపరివర్తన మహోత్సవం నాడు క్రైస్తవ సమైక్యత అష్టమ దినాలు ముగుస్తాయి. పునీత పౌలుగారిని ఆదర్శంగా తీసుకొని క్రైస్తవ సమైక్యత దిశగా మన ఆలోచనల్లో, ఆచరణల్లో మార్పు రావాలి. స్వార్ధం, గర్వం లాంటి దుష్ట లక్షణాలతో ప్రభావితమైన కొన్ని చారిత్రక సంఘటనలు క్రైస్తవ సంఘాల మధ్య విభజనలకు కారణాలయ్యాయి. 
దివ్యపూజా పఠనాలు

మొదటి పఠనం : యోనా 3:1-5, 10

భక్తి కీర్తన 25:4-5, 6-7, 8-9

రెండవ పఠనం : 1 కొరింతి 7:29-31

సువిశేష పఠనం : మార్కు 1:14-20

టిసిబిసి - క్రైస్తవ సమైక్యతా విభాగం, తెలుగు క్రైస్తవ సంఘాల సమాఖ్య (FTC),
ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య (అప్ఫకే),తెలంగాణ రాష్ట్ర క్రైస్తవ సంఘాల సమాఖ్య (TSFC)
తెలంగాణా కౌన్సిల్ ఆఫ్ చర్చ్స్ (NCCIకి అనుబంధంగా ఉన్న), మరియు (A.P. & T.S.లోని పీఠాధిపతుల & చర్చి-హెడ్స్ అపెక్స్ బాడీ)

Tags