ఘనంగా జాతీయ యువత ఆదివారం

ఘనంగా జాతీయ యువత ఆదివారం
జాతీయ యువత ఆదివారం సందర్భముగా కైలాసపురం విచారణ, వేలాంగణిమాత దేవాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విచారణ కర్తలు ఫాదర్ సంతోష్ CMF, గారి ఆద్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
విచారణ యువతీ,యువకుల కొరకు ప్రత్యేక ప్రార్థనలను ఫాదర్ సంతోష్ CMF, గారు జరిపించారు. యువత కొరకు ప్రత్యేక పరిశుద్ధ దివ్యపూజాబలిని ఫాదర్ సంతోష్ CMF, గారు సమర్పించారు. అనంతరం యువతీ, యువకులకు ఆటలపోటీలు ఏర్పాటు చేసి సదస్సుని మరింత ఉత్సాహంగా మార్చారు.
విశాఖ అతిమేత్రాసన యువత డైరెక్టర్ ఫాదర్ ప్రేమ్ కుమార్ ఈ కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఫాదర్ రవితేజ గారు అమూల్యమైన దైవసందేశాన్ని యువతలికి అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువతీ,యువకులు పాల్గొన్నారు.
విచారణ కర్తలు ఫాదర్ సంతోష్ CMF, గారితో కలసి యువత అందరూ విచారణలో అవసరంలో ఉన్నవారి ఇళ్లను సందర్శించి వారికీ అవసరమైన వస్తువములను అందించి ప్రభుయేసుని ప్రేమని చాటారు. యువతంతా ఏకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer