హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పాఠశాలలో పని చేస్తున్న ఒక సిస్టర్ తొలగింపు

 Indian nun on suspicion of making anti-Hindu remarks

హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పాఠశాలలో పని చేస్తున్న ఒక సిస్టర్ తొలగింపు

దక్షిణ భారతదేశంలోని మంగళూరులోని, సెయింట్ గెరోసా ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న  సిస్టర్ మేరీ ప్రభ సెల్వరాజ్‌ను హిందు దేవుళ్లను అవమానించారని ఆరోపిస్తూ ఆమెను విధుల నుంచి తొలగించాలని కోరుతూ ఫిబ్రవరి 12న పెద్ద సంఖ్యలో ప్రజలు స్కూల్ వద్ద నిరసన చేపట్టారు. తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఆరోపించడంతో సన్యాసిని ఉపాధ్యాయిని సస్పెండ్ చేశారు.

సిస్టర్ మేరీ ప్రభ సెల్వరాజ్, సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మంగళూరులోని సెయింట్ గెరోసా ఇంగ్లీష్ మీడియం హయ్యర్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా ఉన్నారు.

నిరసన సమయంలో  విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఇతర హిందూ సమూహాల కూడా పాల్గొన్నాయి. వారు స్కూల్ లోనికి ప్రవేశించి అలజడి సృష్టించారు. పాఠశాల ముందు నిరసనకు మోడీ అనుకూల హిందూ భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి శాసనసభ్యుడు డి.వేదవ్యాస్ కామత్ నాయకత్వం వహించారు. డి.వేదవ్యాస్ కామత్  పాఠశాలలో విద్యార్థులను "జై శ్రీరాం" అని నినాదాలు చేయమని బలవంతం చేశాడు.

"లా అండ్ ఆర్డర్ సమస్యలను నివారించడానికి మేము ఆమెను (సెల్వరాజ్)ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించుకున్నాము" అని సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ యొక్క ప్రాంతీయ ఉన్నతాధికారి సిస్టర్ ఐరీన్ మెనెజెస్ గారు అన్నారు.

సిస్టర్ మేరీ ప్రభ సెల్వరాజ్ గారు  16 ఏళ్లుగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారని, గత ఐదేళ్లుగా సెయింట్ గెరోసాలో పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.గతంలో పాఠశాల సిబ్బందిపై "ఇలాంటి ఫిర్యాదు ఎప్పుడూ లేదు" అని సిస్టర్ ఐరీన్ మెనెజెస్ గారు చెప్పారు.

 హిందూ దేవుళ్లను అవమానకరంగా ప్రస్తావించారని ఆరోపిస్తూ ఒక విద్యార్థి తల్లి నుండి ఒక ఆడియో క్లిప్ వైరల్ అయింది. మంగళూరు డియోసిసన్ వీక్లీ న్యూస్ మ్యాగజైన్ ఎడిటర్ గురుశ్రీ  రూపేష్ మద్దా గారు మాట్లాడుతూ, ఆడియో క్లిప్‌ను "తల్లిదండ్రులు ప్రసారం చేశారని, ఇది పెద్ద సంచలనం సృష్టించడానికి సిస్టర్  మరియు విద్యార్థులతో సహా ఇతరులపై నిరాధార ఆరోపణలు చేసారు " అని అన్నారు.

కర్ణాటకలోని 61 మిలియన్ల జనాభాలో 1.87 శాతం క్రైస్తవులు ఉన్నారు మరియు వారిలో 80 శాతం మంది హిందువులు.

క్రైస్తవ మతం 1521లో పోర్చుగీస్ మిషనరీలతో తీర ప్రాంతానికి చేరుకుంది.మంగళూరు డియోసెస్ భారతదేశం అంతటా పని చేసే అనేక మంది మిషనరీలను మరియు 50 మందికి పైగా పీఠాధిపతు(బిషప్‌లను)లను తయారు చేసింది. అనేక సేవ కార్యక్రమాలు చేస్తున్నారు .వీరి ఆధ్వర్యంలో ఎన్నో విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలను ప్రజల కొరకు  వినియోగిస్తున్నారు. ప్రస్తుతం, మంగళూరు నుండి 29 మంది బిషప్‌లు మరియు ముగ్గురు ఆర్చ్ బిషప్‌లు భారతీయ మేత్రాసనాలలో పనిచేస్తున్నారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Producer