భవిష్యత్ నాయకులను శక్తివంతం చేయడం మన బాధ్యత : IFFAsia

 

భవిష్యత్ నాయకులను శక్తివంతం చేయడం మన బాధ్యత : IFFAsia

ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మేషన్, ఫోండాసియో ఆసియా (IFFAsia) ఫిబ్రవరి 2న ఫిలిప్పీన్స్‌లోని "రేడియో వెరిటాస్ ఆసియా" క్యాంపస్‌లో 11 నెలల నిర్మాణ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2025 విద్యా సంవత్సరానికి సంబందించి ఇది 16బ్యాచ్.  

ఈ కార్యక్రమం దివ్యబలి పూజ తో  ప్రారంభమయినది.  ఇది విశ్వాసం, సేవ మరియు నాయకత్వ అభివృద్ధికి నిబద్ధతను సూచిస్తుంది.

ఈ సంవత్సరం, మంగోలియా, మయన్మార్, లావోస్, వియత్నాం మరియు తైమూర్-లెస్టే నుండి 14 మంది పాల్గొన్నారు. వీరిలో  8 మంది మహిళలు మరియు 6 మంది పురుషులు ఉన్నారు.  వారి విశ్వాసం మరియు నాయకత్వ నైపుణ్యాలను మరింతగా పెంచుకోవడానికి ఈ 11 నెలల తర్ఫీదును పొందనున్నారు.  

ఈ దివ్యబలి పూజ లయోలా స్కూల్ ఆఫ్ థియాలజీ అధ్యక్షుడు (జెస్యూట్ ఫాదర్)  గురుశ్రీ ఎన్రికో సి. యూసేబియో గారి ఆధ్వర్యంలో జరిగింది,

ఈ సందర్భముగా గురుశ్రీ ఎన్రికో గారు దైవసందేశాని అందించారు. మానవాళికి సేవ చేయడానికి తమ జీవితాలను అర్పించాలని ఆయన విద్యార్థులను కోరారు మరియు సవాళ్లలో కూడా దేవుని ఉనికిని గుర్తించి, విశ్వాస నేత్రాల ద్వారా వాస్తవికతను చూడాలని వారిని ఆహ్వానించారు.దేవుని వాగ్దానాల ఆశ మరియు నెరవేర్పుపై నమ్మకం ఉంచమని కూడా ఆయన వారిని ప్రోత్సహించారు.

IFFAsia డైరెక్టర్ మిస్ ఫ్లోరెన్స్ అలెక్సియస్, ఈ ప్రత్యేక సందర్భానికి అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. యువత మరియు సామాన్యులకు సాధికారత కల్పించడంలో సంస్థ యొక్క నిబద్ధతను అయన మరోసారి పునరుద్ఘాటించారు.

IFFAsia 2006లో స్థాపించబడినప్పటి నుండి,  16 దేశాల నుండి 250 మందికి పైగా శిక్షణ ఇచ్చింది మరియు ఆసియా అంతటా సువార్త సేవకై  నాయకులను సిద్ధం చేసి పంపడం కొనసాగిస్తోంది.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer