హంతకుడిపై 'దయ అభ్యర్థన'ను భారత క్రైస్తవ నాయకులు ఖండించారు

హంతకుడిపై 'దయ అభ్యర్థన'ను భారత క్రైస్తవ నాయకులు ఖండించారు
ఆస్ట్రేలియన్ మిషనరీ గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు పిల్లల హత్య కేసులో ప్రధాన దోషి దారా సింగ్ అని పిలువబడే రవీంద్ర కుమార్ పాల్‌కు రాష్ట్రపతి క్షమాపణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను క్రైస్తవ నాయకులు మరియు విశ్వాసులు విమర్శించారు.
"సత్యాన్ని లేదా బాధితుల బాధను పణంగా పెట్టి ఎప్పుడూ దయ కోసం అభ్యర్థన చేయకూడదు" అని ఫాదర్ అజయ్ సింగ్ జూలై 24న UCA న్యూస్‌తో అన్నారు.
ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నదారా సింగ్ అనుచరుడైన దోషి మహేంద్ర హెంబ్రామ్ జూలై 15న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాభిక్ష పిటిషన్‌ను సమర్పించారు. 25 సంవత్సరాలు జైలు జీవితం గడిపిన తర్వాత హెంబ్రామ్ తన "మంచి ప్రవర్తన" పేరుతో గత ఏప్రిల్‌లో విడుదలయ్యాడు.
గ్రాహం స్టెయిన్స్ గారిని మరియు 6 మరియు 10 సంవత్సరాల వయస్సు గల అతని ఇద్దరు కుమారులను సజీవ దహనం చేసినందుకు నిందితులు ఎటువంటి "పశ్చాత్తాపం" వ్యక్తం చేయలేదు.
2003లో, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దారా సింగ్‌కు మరణశిక్ష మరియు మరో 12 మందికి జీవిత ఖైదు విధించింది. 2005లో, ఒరిస్సా హైకోర్టు దారా సింగ్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
అతని సహచరుడు హేంబ్రామ్‌కు కూడా అదే శిక్ష విధించబడింది. 2011లో, సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించింది.
“దారా సింగ్ కేసులో ద్వేషం మరియు హింస యొక్క భావజాలాన్ని అనుసరించి ముగ్గురు అమాయకులను చంపిన తన నేరానికి తాను చింతిస్తున్నానని అతను ఒక్కసారి కూడా "పశ్చాత్తాప పడలేదని ” సీనియర్ జర్నలిస్ట్ మరియు ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్ ప్రతినిధి దయాల్ గారు ప్రశ్నించారు.
అయితే మరోవైపు ....గ్రాహం స్టెయిన్స్ గారిని దేవుడుగా చూసేవారు చాలామందే వున్నారు.
గ్రాహం స్టెయిన్స్ లెప్రసీ షెల్టర్ హోంలో ఇప్పటికీ ఆయన దగ్గర చికిత్స తీసుకుని వ్యాధి నుంచి కోలుకున్న రోగులు చాలామందే ఉన్నారు.
ఇక్కడ శారదా ద్రదూ అనే 75 ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమెకు కుష్ఠురోగం రావడంతో 25 ఏళ్ల క్రితం ఇంటి నుంచే కాదు, గ్రామం నుంచే బయటకు పంపించేశారు.
గ్రాహం పేరు చెప్పగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. 'ఆయన మా దృష్టిలో దేవుడు. ఎందుకంటే అయినవాళ్లంతా ఇంటి నుంచి గెంటేస్తే ఆయన నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు. చికిత్స చేశారు, నాకొక గౌరవం ఇచ్చారు' అని ఆమె అన్నారు.
అలాగే ఇదే కేసు లో మాజీ బాల నేరస్థుడుగా ఉన్న చెంగు హన్స్దా, తాను క్రైస్తవ మతంలోకి మారినట్లు బహిరంగంగా ప్రకటించాడు. అది తనకు అంతర్గత శాంతి మరియు స్వస్థతను తెచ్చిపెట్టిందని పేర్కొన్నాడు.
దోషిగా తేలిన సమయంలో తన మైనర్ కారణంగా తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన చెంగు, తాను ఇచ్చిన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, క్రైస్తవ మతంలోకి మారాలనే తన నిర్ణయం పై ఎటువంటి ఒత్తిడి లేదని, ప్రభుయేసుని ప్రేమను తెలుసుకున్నని, వ్యక్తిగత బాధలోనుండి మరియు ఆత్మపరిశీలన నుండి ఇది ఉద్భవించిందని అన్నారు. "నేను క్రైస్తవుడిగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నాను" అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
Article and Design: M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer