శాంతి స్థాపన ధ్యేయంగా పాత్రికేయులు పనిచేయాలన్న 14వ సింహరాయలు పోప్

సోమవారం మే 12,వాటికన్‌లోని ఆరవ పాల్ హాల్‌లో మీడియా నిపుణులతో సమావేశమై, గత కొన్ని వారాల పాటు అవిశ్రాంతంగా రోమ్ పరిసర ప్రాంతాలలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇటాలియన్‌ భాషలో 14వ సింహరాయల పోప్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా సత్యాన్ని కనుగొనే క్రమంలో జైళ్ల పాలైన విలేకరులను వెంటనే విడుదల చేయాలని కోరారు.

పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రం మనకున్న విలువైన కానుకలని పోప్ తెలిపారు.

శాంతి బలోపేతమయ్యేలా, యుద్ధాన్ని తిరస్కరించేలా రాయాలని, అణగారిన వారి స్వరంగా నిలవాలని పాత్రికేయలను కోరారు. న్యాయం కొరకు జైలు పాలైన జర్నలిస్టులకు పోప్ సంఘీభావం ప్రకటించారు.

ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి యుద్ధం పురోగతిని గురించి బయటి ప్రపంచానికి తెలిపే వారి గురించే నా తపనంతా అని పోప్ అన్నారు .

గౌరవం, న్యాయం, ప్రజల సమాచార హక్కును కాపాడే ధీరులు వీరు అని పోప్ పేర్కొన్నారు.

శాంతి స్థాపన ధ్యేయంగా జర్నలిస్టులు పనిచేయాలని, బలమైన సమాజాన్ని నిర్మించే స్థాపకులుగా వర్ధిల్లాలని ఆయన పిలుపునిచ్చారు.