వేళాంగణి మాత దేవాలయంలో విభూది బుధవారము

వేళాంగణి మాత దేవాలయంలో విభూది బుధవారము
విశాఖ అతిమేత్రాసనం వేళాంగణి మాత దేవాలయం, కైలాసపురం లో విభూది బుధవార సాంగ్యాలు భక్తియుతంగా జరిగాయి. విచారణ కర్తలు గురుశ్రీ సంతోష్ CMF, మరియు సహాయక గురువులు గురుశ్రీ జాన్ CMF ఆధ్వర్యంలో దివ్యబలిపూజ భక్తియుతంగా జరిగింది.
విశ్వాసులు అధిక సంఖ్యలో ఈ దివ్యబలి పూజ లో పాల్గొన్నారు. విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. దివ్యబలి పూజ లో విశ్వాసుల నుదిటిపైన విభూదిని సిలువ ఆకారంలో గురువులు రాయడం జరిగింది.
దివ్యబలి పూజ అనంతరం 40 రోజులు దీక్ష తీసుకునే విశ్వాసులకు "దీక్ష స్వీకరణ కార్యక్రమం" గురుశ్రీ సంతోష్ గారి చేతులమీదుగా జరిగింది.
Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer