విశాఖ అతిమేత్రాసనంలో ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

విశాఖ అతిమేత్రాసనంలో ఘనంగా ‘రన్‌ ఫర్‌ జీసస్‌’

గుడ్‌ఫ్రైడే, ఈస్టర్‌ మధ్య.. పరిశుద్ధ శనివారం నాడు వివిధ ప్రాంతాలలో   వివిధ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ‘రన్‌ ఫర్‌ జీసస్‌’ ను ఘనంగా నిర్వహించారు. 

విశాఖ అతిమేత్రాసనం లో  ప్రపంచ శాంతి, క్రైస్తవుల ఐక్యత కొరకు, దేశాన్ని, రాష్ట్రంలో ఉన్న  నాయకుల కొరకు , మంచి ఆయురారోగ్యాలు నెలకొనాలని కాంక్షిస్తూ  శనివారం ఉదయం " రన్ ఫర్ జీసస్ (Run For Jesus)" కార్యక్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  అనూహ్య స్పందన లభించింది. 

ఈ కార్యకమంలో విశాఖ ఆగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు ,MSFS  ప్రొవిన్సియల్  సుపీరియర్ ఫాదర్ బవిరి సురేష్ గారు,  విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్  ఫాదర్ జొన్నాడ ప్రకాశ్ గారు, కైలాసపురం విచారణ కర్తలు  ఫాదర్ సంతోష్ CMF గారు, ఫాదర్ భాస్కర్ ఇతర గురువులు  పాల్గొన్నారు.  అధికసంఖ్యలో సిస్టర్స్,యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

ఫాదర్ లు , పాస్టర్లు, వివిద క్రైస్తవ సంఘాల నాయకులు, విశ్వాసులు, యువత, చిన్నారులు, రన్ ఫర్ జీసస్ కమిటీ సభ్యులు దాదాపు 5 వేలమంది క్రైస్తవులు నడచుకుంటూ, కొంతమంది వాహనాలపై  ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రభు యేసుని ప్రేమను ప్రకటిస్తూ , బైబిల్  వాక్యాలతో కూడిన ఫ్లకార్డులు, జెండాలతో  రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  క్రీస్తు మరణ, పునరుత్థానాన్ని ప్రకటిస్తూ, క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ ముందుకు సాగారు. 

Article and Design By M. Kranthi Swaroop 
RVA Telugu Online Content Producer