రోమ్ వేదికగా పోప్ ఫ్రాన్సిస్ కొరకు ప్రత్యేక ప్రార్థనలు

పోప్ ఫ్రాన్సిస్ త్వరితగతిన కోలుకోవాలని వాటికన్ వేదికగా నిన్న సాయంత్రం ఫిబ్రవరి 24 న
కార్డినలు, పీఠాధిపతులు మరియు రోమన్ క్యూరియా సభ్యులతో సహా వందలాది మంది ప్రజలు జపమాలను జపించారు
కార్డినల్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ పియట్రో పరోలిన్ నేతృత్వంలోని జపమాలను జపించారు, పొప్ ఫ్రాన్సిస్ తన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా" ప్రార్థనలు చేయమని అందరిని కోరారు.
ఈ జపమాల ధ్యానంలో పెద్ద ఎత్తులో కతోలిక విశ్వాసులు, జగద్గురువుని పరిపాలన యంత్రాంగంలో వివిధ విభాగాలలో సేవలందిస్తున్న ఉద్యోగులు, కార్దినాలు, కన్యా స్త్రీలు, గురువులు పాల్గొని పోప్ కొరకు ప్రార్ధించారు.
అదేవిధంగా విశ్వ కతోలిక శ్రీసభ పోప్ కొరకు ఏకమై ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నారు. పోప్ చికిత్స పొందుతున్న గెమిల్లి ఆసుపత్రిలో దివ్యసత్ప్రసాద ఆరాధన కూడా ప్రతిరోజు నిర్వహిస్తున్నారు.