రోమ్ మేత్రాసనానికి 1 మిలియన్ యూరోలు విరాళంగా ఇచ్చిన పొప్ ఫ్రాన్సిస్

ఇటీవలి వారాల్లో, రోమ్‌లోని జెమెల్లి పాలీక్లినిక్‌లో ఆసుపత్రిలో చేరడానికి ముందు, పోప్ ఫ్రాన్సిస్ గృహ అత్యవసర పరిస్థితుల కొరకు డాన్ రాబర్టో సర్డెల్లి నిధికి విరాళం ఇచ్చారు.
రోమ్‌లోని ఒక మాజీ అధికారి ఇంటిని పునరుద్ధరించి అవసరంలో ఉన్నవారి కోసం 20 అపార్ట్మెంట్లుగా మార్చనున్నారు దానికి ఒక మిలియన్ యూరోలను విరాళంగా ఇచ్చారు.
జనవరి 30న రోమన్ San Policarpoలో డాన్ రాబర్టో సర్డెల్లి జ్ఞాపకార్థం జరిగిన సమావేశంలో ఈ వార్తను మొదట ప్రకటించారు, అయితే ఆ సమయంలో పోప్ ఖచ్చితమైన మొత్తాన్ని వెల్లడించలేదు.
ఇటీవలి రోజుల్లో, రోమ్ మేత్రాసన గురువుల వికార్ జనరల్ కార్డినల్ బాల్డస్సారే రీనా (Baldassare Reina) కు పంపిన లేఖలో ఈ సంఖ్య వెల్లడైంది.
మతాచార్యులు తమ ఒక నెల ఆర్థిక సహాయం లేదా దానిలో కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని కార్డినల్ ఆహ్వానించారు.
"మా ఈ నిర్ణయం చాలా మంది హృదయాలను తాకుతుందని నేను ఆశిస్తున్నాను, తద్వారా రోమ్ నగరంలో గృహ అత్యవసర పరిస్థితిని చురుకుగా పరిష్కరించేందుకు, సార్డెల్లి నిధికి మద్దతు ఇవ్వడానికి ఎక్కువ మంది విశ్వాసులను ప్రోత్సహించగలదు" అని ఆయన అన్నారు.