యుద్ధ ఖైదీల విడుదల కోసం ప్రార్థనలు చేసిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ఖైదీల విడుదల కోసం ప్రార్థనలు చేసిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు

19 నెలలకు పైగా రష్యన్ బందిఖానాలో ఉన్న పది మంది ఉక్రేనియన్ ఖైదీలను రష్యన్ దళాలు విడుదల చేసిన సందర్భంగా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు "యుద్ధ ఖైదీలందరూ త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని" ప్రార్థించారు.

జూన్ 29, శనివారం, ఏంజెలస్ వద్ద ప్రార్థనలో " పునీత పేతురు, పౌలుల మహోత్సవ పండుగ సందర్భముగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు మాట్లాడుతూ  "ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదలైన  ఇద్దరు గ్రీకు కాథోలిక గురువులను విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రార్థనలు చేశారు. ఇద్దరు గురువులు, ఇవాన్ లెవిట్స్కీ మరియు బోహ్డాన్ హెలెట (Ivan Levytskyi and Bohdan Heleta,).


ప్రపంచవ్యాప్తంగా యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజలందరికీ ఫ్రాన్సిస్ పాపు గారు తన విచారాన్ని వ్యక్తం చేస్తూ, "పోరాటంలో గాయపడిన మరియు బెదిరింపులకు గురైన ప్రజలందరి కోసం ప్రార్థించమని, దేవుడు వారిని విడిపించాలని , శాంతి కోసం వారు చేస్తున్న  పోరాటంలో వారికి మద్దతు ఇవ్వాలని" క్రైస్తవులను కోరాడు.

ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ  పది మంది ఉక్రేనియన్ ఖైదీలను రష్యన్ దళాలు విడుదల చేయడంలో "అమూల్యమైన సహకారం" అందించినందుకు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి  మరియు వాటికన్ దౌత్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer