మొజాంబిక్ కోసం ప్రార్థనలు - పరిశుద్ధ లియో XIV పాపు గారు

మొజాంబిక్ కోసం ప్రార్థనలు -  పరిశుద్ధ లియో XIV  పాపు గారు

ఆదివారం నాడు ఏంజెలస్ వద్ద ప్రార్థనల తర్వాత,  పరిశుద్ధ 14 వ లియో పాపు గారు  మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ప్రావిన్స్ మరియు ఉక్రెయిన్ ను గుర్తు చేసుకున్నారు. హింస మరియు యుద్ధం వల్ల గాయపడిన ప్రజల కోసం ప్రార్ధించాలని కోరారు. 

మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ఉన్న ప్రజల పట్ల పరిశుద్ధ 14వ లియో పాపు గారు తన ఆందోళనను వ్యక్తం చేశారు. వారు తీవ్రవాద హింస కారణంగా సంవత్సరాల తరబడి అభద్రతను ఎదుర్కొంటున్నారు. 2017 నుండి, ఉత్తర ప్రావిన్స్‌లో జరిగిన దాడుల్లో వేలాది మంది మరణించారు మరియు పది లక్షల మందికి పైగా ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి, దేశంలోని ఇతర ప్రాంతాలలో తలదాచుకుంటున్నారు. 

"మరణం మరియు స్థానభ్రంశం కలిగించే అసురక్షిత మరియు హింసాత్మక పరిస్థితికి బాధితులుగా మారిన కాబో డెల్గాడో ప్రజలకు నేను నా సాన్నిహిత్యాన్ని తెలియజేస్తున్నాను" అని పరిశుద్ధ 14వ లియో పాపు గారు అన్నారు. "మన ఈ సోదర సోదరీమణులను" మరచిపోవద్దని ఆయన విశ్వాసులను కోరారు. మొజాంబిక్ నాయకుల "భద్రత మరియు శాంతి" కొరకు చేస్తున్న  ప్రయత్నాలు విజయవంతమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

యుద్ధ విపత్తుతో బాధపడుతున్న వారందరికీ ఆగస్టు 22వ తేదీ శుక్రవారం నాడు పాటించిన ప్రార్థన మరియు ఉపవాస దినాన్ని పరిశుద్ధ 14వ లియో పాపు గారు గుర్తుచేసుకున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ఉక్రెయిన్ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఆయన "ఉక్రెయిన్ కోసం ప్రపంచ ప్రార్థన" (World Prayer for Ukraine)ను చేయాలన్నారు. ఉక్రెయిన్ దేశానికి శాంతిని ప్రసాదించమని ఉక్రేనియన్ సోదరులు మరియు సోదరీమణులతో కలసి అందరు ప్రార్ధించాలని కోరారు. 

 

Article and Design: M. Kranthi Swaroop