మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు

మహా పూజ్య ఉడుమల బాల గారు విశాఖ అగ్రపీఠాధిపతులు గా నియమితులయ్యారు
విశాఖపట్నం అతిమేత్రాసనం ఒక చారిత్రాత్మక క్షణానికి సాక్ష్యంగా నిలిచింది. విశాఖపట్నం అతిమేత్రాసనానికి నూతన అగ్రపీఠాధిపతి గా మహా పూజ్య ఉడుమల బాల గారిని ఘనంగా నియమించారు. ఈ కార్యక్రమం విశాఖపట్నంలోని జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన దేవాలయంల మైదానంలో జరిగింది. దీనికి మతాధికారులు, మతపరమైన మరియు విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
మహా పూజ్య కార్డినల్ పూల అంతోని గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. భారతదేశం మరియు నేపాల్‌కు అపోస్టోలిక్ నన్సియో అయిన మహా పూజ్య లియోపోల్డో గిరెల్లి గారు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ లాటిన్లో పాపల్ బుల్ (papal bull ) నియామకాన్ని చదివారు వినిపించారు.
ఏలూరు పీఠాధిపతులు మరియు విశాఖ అతిమేత్రాసన పాలనాధికారి మహా పూజ్య పొలిమెర జయరావు గారు స్థాపన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతి మహా పూజ్య మల్లవరపు ప్రకాశ్ గారు, బెంగళూరు ఆర్చ్ బిషప్ పీటర్ మచాడో, CCBI ఉపాధ్యక్షుడు, ఆగ్రా ఆర్చ్ బిషప్ రాఫీ మంజలి, రాయ్‌పూర్ ఆర్చ్ బిషప్ విక్టర్ హెన్రీ ఠాకూర్, కటక్-భువనేశ్వర్ ఆర్చ్ బిషప్ జాన్ బార్వా ,ఇతర మేత్రాసన పీఠాధిపతులుతో పాటు టీసీబీసీ పీఠాధిపతులు, వివిధ మేత్రాసనాలుకు చెందిన గురువులు ,సిస్టర్స్ అధికసంఖ్యలో పాల్గొన్నారు.
గుంటూరు పీఠాధిపతులు ఎమెరిటస్ మహా పూజ్య గాలి బాలి గారు , దివ్యబలిపూజలో దైవసందేశాని అందించారు. సువార్తను వ్యాప్తి చేయడంలో విశ్వాసం, ఐక్యత మరియు మిషనరీ ఉత్సాహం యొక్క ప్రాముఖ్యతను తన ప్రసంగంలో వివరించారు.
ఆద్యంతం కన్నులపండుగగా ఈ కార్యక్రమం జరిగింది. విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ గురుశ్రీ దిగ్గింపూడి బాలశౌరి గారు, వికార్ జనరల్ గురుశ్రీ జొన్నాడ జాన్ ప్రకాష్ గారు, ఇతరగురువులు సహకరించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer