భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ

భక్తియుతంగా పవిత్ర తైలముల దివ్య బలిపూజ
విశాఖ అతిమేత్రాసనం, జ్ఞానాపురంలోని పునీత పేతురు ప్రధాన దేవాలయంలో పవిత్ర తైలముల దివ్య బలిపూజ భక్తియుతంగా జరిగింది. అధిక సంఖ్యలో గురువులు, సిస్టర్స్ మరియు విశ్వాసులు తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
విశాఖ ఆగ్రపీఠాధిపతులు మహా పూజ్య ఉడుమల బాల గారు మరియు విశాఖ అతిమేత్రాసన విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారు ఈ తైలాల ప్రతిష్ట మహా దివ్యపూజాబలిని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో MSFS ప్రొవిన్సియల్ సుపీరియర్ ఫాదర్ బవిరి సురేష్ గారు, విశాఖ అతిమేత్రాసన వికార్ జనరల్ ఫాదర్ దుగ్గంపూడి బాలశౌరి గారు, విశాఖ అతి మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ జొన్నాడ ప్రకాశ్ గారు,ఫాదర్ సరిస ప్రతాప్ గారు, ఫాదర్ పొలమరశెట్టి మరియాదాస్ గారు, సానబోయిన శౌరిబాబు గారు ఇతర గురువులు పాల్గొన్నారు.
మహా పూజ్య ఉడుమల బాల గారు అమూల్యమైన దైవ సందేశాన్ని విశ్వాసులకు అందించారు. దైవ సందేశమందిస్తూ పవిత్ర తైలాలు, వాటి ఉద్ధేశాల గురించి వివరించారు. గురువుల కోసం ప్రార్థించాలని కోరారు. అనంతరం నూతన తైలాలను మహా పూజ్య మల్లవరపు ప్రకాష్ గారితో కలసి అభిషేకించారు.ఈ దైవకార్యం కథోలిక సంప్రదాయాలను, విశ్వాసాన్ని బలపరిచింది.
విచారణ గాయక బృందం మధురమైన గీతాలను ఆలపించారు. అధిక సంఖ్యలో ప్రజలు ఈ తైలాల దివ్యబలి పూజలో పాల్గొన్నారు.
Article and Design By M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer