ప్రపంచ రక్త దాతల దినోత్సవం | World Blood Donor Day| June14

ప్రపంచ రక్త దాతల దినోత్సవం | World Blood Donor Day| June14

"ప్రపంచ రక్త దాతల దినోత్సవం " ప్రతి సంవత్సరం  జూన్ 14వ తేదీన  జరుపుకుంటారు.ఎక్కువగా  రోడ్డు ప్రమాదాలు, ప్రసవ సమయం లాంటి అత్యవసర పరిస్థితులలో  రక్తం అవసరం.

 1901లో ఆస్ట్రేలియాకు చెందిన కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు.  ఆయన జయంతి నాడు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన రక్తం ఏ  గ్రూప్ అంటే ఏ పాజిటివ్ , బి పాజిటివ్, ఓ పాజిటివ్ అని ఎలా అయితే గుర్తిస్తున్నామో వీటిని గ్రూపులుగా విభజించింది కార్ల్ లాండ్‌స్టీనర్.

ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 ఏళ్లలోపు రక్తదానం చేయడానికి అర్హులు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల తర్వాత మళ్లీ రక్తం ఇవ్వొచ్చు. ఒకసారి రక్తదానం చేస్తే , ముగ్గురుకి ప్రాణందానం చేయవచ్చు.

 

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer