పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం విరాళం ఇచ్చిన APSSF

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోషల్ ఫోరమ్ వారు గుంటూరు మేత్రాసనం, మనోవికాస కేంద్రం పునీత అన్నమ్మ మానసిక వికలాంగుల  పాఠశాల వారికి ఫిబ్రవరి 20,2024 న పేపర్ ప్లేట్ల తయారీ యంత్రం విరాళంగా అందించారు 
దీనిని బొంగరాలబీడు,లూర్దు విచారణ కర్తలు గురుశ్రీ రేపూడి రాయప్ప గారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సోషల్ ఫోరమ్ డైరెక్టర్ గురుశ్రీ  కనపాల కిరణ్ కుమార్ గార్లు ఈ యంత్రాన్ని ఆశీర్వదించి, ప్రారంభించారు.