పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి బహుమతిగా "పోప్‌మొబైల్‌"ను అందించిన మెర్సిడెస్ బెంజ్

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి బహుమతిగా "పోప్‌మొబైల్‌"ను అందించిన మెర్సిడెస్ బెంజ్


డిసెంబర్ 4న, మెర్సిడెస్ బెంజ్ CEO, ఓలా కల్లెనియస్ గారు  మరియు ఇతర టీమ్ సభ్యులు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారికి కొత్త కన్వర్టిబుల్, ఎలక్ట్రిక్ G-క్లాస్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇది పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అవసరాలకు ప్రత్యేకంగా మరియు  జూబ్లీ సంవత్సరం సందర్భంగా  రూపొందించబడింది.

ప్రత్యేకించి తక్కువ వేగంతో రూపొందించబడిన ఈ పోప్‌మొబైల్ తరచుగా సెయింట్ పీటర్స్ స్క్వేర్ గుండా పబ్లిక్ ప్రేక్షకుల మధ్య నడపబడుతుంది.

పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి అభ్యర్థన మేరకు, వాహనంలో పనిచేసిన మొత్తం బృందం డెలివరీకి హాజరయ్యారు. 100 సంవత్సరాలుగా, మెర్సిడెస్ వాటికన్‌తో కలిసి 'పోప్‌మొబైల్' అని పిలవబడే పాపు గారి వాహనాన్ని అందించడానికి పని చేసింది. మొదటిది 1930లో  XI పయస్ పాపు గారికి ఇవ్వబడింది.

వాటికన్ తన వాహనాలన్నింటినీ 2030 నాటికి ఉద్గార రహితంగా మార్చాలని యోచిస్తోంది. ఈ లక్ష్యాన్ని వారు మెర్సిడెస్‌తో పంచుకోవడం కాలుష్య రహిత ప్రాధాన్యతలలో ఇది  ఒకటి.

ఈ కారు ప్రత్యేకంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కోసం తయారు చేయబడింది అని,  "అసలు వాహనంతో పోలిస్తే, బేస్ పరంగా చాలా మార్పులు జరిగాయి అని ,  మొదటి  స్థానం భిన్నంగా ఉంది" అని G-క్లాస్ మోడల్‌లను ఉత్పత్తి చేసే గ్రాజ్ ఫ్యాక్టరీలో డెవలప్‌మెంట్ విభాగంలో పనిచేస్తున్న పీటర్ జోటర్ గారు వివరించారు.

కొత్త ఎలక్ట్రిక్ కారులో పాపు గారి సౌకర్యార్థం తిరిగే సీటు మరియు చేతితో తయారు చేసిన ఇంటీరియర్ ఫర్నిషింగ్‌లు ఎంతో అందంగా ఉన్నాయి. లైసెన్స్ ప్లేట్ SCV 1 (వాటికన్ సిటీ) అని ఉంది. వాహన తయారీలో పనిచేసిన మెర్సిడెస్ బృందానికి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు  అభినందించారు.

Article and Design By
M. Kranthi Swaroop
RVA Telugu Online Content Producer