దేవుడు మనలను ఎల్లపుడు ఆదుకుంటారన్న పోప్

దేవుడు మనలను ఎల్లపుడు ఆదుకుంటారన్న పోప్
మన జీవితం ఎంత కష్టమైనదైనా,యేసుక్రీస్తు మనలను ఎప్పుడూ ఆదుకుంటారు.
మనిషి జీవితం ఆనందం,నిరాశ,విజయాలు, వైఫల్యాలు,సంతృప్తి అన్నీ కలిసిన అనుభవాలతో నిండిఉంటుందని ,విరుద్ధ పరిస్థితుల్లోనూ యేసుక్రీస్తు మనకు ఆశగా, బలంగా నిలుస్తాడని సామాన్య ప్రేక్షకుల సమావేశంలో పోప్ అన్నారు.
మనిషి అంతరాత్మ తీరని తృష్ణతో నిండివుంటుంది. దానిని అధికారంతో, హోదాతో,లేదా సంపదతో తీర్చలేము.
మన ఆశను నెరవేర్చగల ఒకేఒక వ్యక్తి యేసుక్రీస్తు.
యేసు పునరుత్థానం మన విశ్వాసానికి కేంద్రమని పోప్ గుర్తుచేశారు.
ప్రభు సజీవునిగా మన మధ్య నడుస్తూ,మన బలహీనతల్లో మనకు ధైర్యం ఇస్తూ ఉంటారని పోప్ సందేశాన్ని ముగించారు.