చట్టవిరుద్ధ అరెస్టు' తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన సిస్టర్స్

చట్టవిరుద్ధ అరెస్టు' తర్వాత షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలైన సిస్టర్స్ 

ఛత్తీస్‌గఢ్‌లోని, దుర్గ్ సెంట్రల్ జైలు నుండి సిస్టర్స్ మరియు నారాయణ్‌పూర్‌కు చెందిన ఒక గిరిజనుడు శనివారం (ఆగస్టు 2, 2025)  బెయిల్‌పై బయటకు వచ్చారు. తొమ్మిది రోజుల కస్టడీ తర్వాత వీరు  విడుదలయ్యారు. జైలు వెలుపల, కేరళకు చెందిన పార్లమెంటు సభ్యులు మరియు  కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మరియు సన్యాసినుల బంధువులు మరియు తోటి సోదరీమణులు   విడుదలను స్వాగతించారు. 

అరెస్టు తర్వాత, సిస్టర్స్ ను దుర్గ్ జైలులో ఉంచారు. బిలాస్‌పూర్‌లోని ప్రత్యేక NIA కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను ప్రధానంగా విచారించే NIA కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ఇవ్వడంజరిగింది. ఈ దర్యాప్తు సమయంలో ముందస్తు అనుమతి లేకుండా సిస్టర్స్  దేశం విడిచి వెళ్లకుండా నిషేధించింది. 

ప్రతి పక్షం (15 ) రోజులకు ఒకసారి వారి పాస్‌పోర్ట్‌లను అప్పగించాలని, వారి నివాసానికి సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాలని మరియు సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలని వారిని కోరింది.

అలాగే సిస్టర్స్  మీడియాతో మాట్లాడకుండా కోర్టు నిషేధం విధించింది, వారు "ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ప్రెస్ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు లేదా బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు" అని పేర్కొంది.

ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుకు దారితీయవచ్చని హెచ్చరించింది.
50,000 రూపాయల  బాండ్ మరియు ఒక్కొక్కరికి ఒకే మొత్తంలో ఇద్దరు పూచీకత్తులు సమర్పించిన తర్వాత ముగ్గురూ ఒకే రోజు (ఆగస్టు 2) జైలు నుండి విడుదలయ్యారు.

బజరంగ్ దళ్ సభ్యుల బృందం గొడవ సృష్టించి పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత దుర్గ్ రైల్వే స్టేషన్‌లోనే  ముగ్గురిని అరెస్టు చేశారు. బజరంగ్ దళ్ సభ్యుడు రవి నిగమ్ ఫిర్యాదు చేసాడు.   

నీ ముఖం పగలగొడతాను అని బజరంగ్ దళ్ సభ్యులు సిస్టర్స్ లను దుర్భాషలాడుతున్న వీడియో వైరల్ గా మారింది.  ముఖ్యంగా వీడియో లో జ్యోతి శర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వీడియోలో, జ్యోతి  అక్కడ వున్నా వ్యక్తిపై "అర్థమైందా? నువ్వు మాట్లాడతావా? లేక నేను నిన్ను కొట్టాలా?" అని అరుస్తూ కనిపిస్తుంది. సిస్టర్స్ వైపు తిరిగి, "నువ్వు మాట్లాడకూడదనుకుంటే, నేను నీ ముఖాన్ని పగలగొడతాను, నేను నిన్ను హెచ్చరిస్తున్నాను" అని బెదిరించింది. 

ఆసమయంలో దుర్గు రైల్వే స్టేషన్లో ఇంత జరుగుతున్న బజరంగ్ దళ్ సభ్యులను ఏ ఒక్కరు నివారించలేదు. త్రిస్సూర్ మెట్రోపాలిటన్ ఆర్చ్ బిషప్ మరియు కాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (CBCI) అధ్యక్షుడు మహా పూజ్య ఆండ్రూస్ గారు  మాట్లాడుతూ "ఎల్లప్పుడూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సిస్టర్స్ నిలబడి పనిచేస్తారని ఎవరూ మర్చిపోకూడదు
" అని అన్నారు.

Article and design by 

M kranthi swaroop