ఆస్ట్రేలియా ప్రధాన మంత్రితో సమావేశమైన XIV లియో పోప్

వాటికన్‌లో సోమవారం మే 19 మధ్యాహ్నం కామన్వెల్త్ ఆఫ్ ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి శ్రీ ఆంతోని అల్బనీస్‌ను XIV లియో పోప్ కలిశారు.
పోప్‌తో సమావేశం తర్వాత ప్రధాన మంత్రి అల్బనీస్ హోలీ సి రాష్ట్రాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సంబంధాల కార్యదర్శి మహా పూజ్య పాల్ రిచర్డ్ ను కలిసినట్లు
హోలీ సీ ప్రెస్ ఆఫీస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
"సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్‌లో జరిగిన ఈ చర్చల సందర్భంగా హోలీ సీ మరియు ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు, అలాగే "సమాజ సేవలో, ముఖ్యంగా విద్యా రంగంలో కతోలిక శ్రీసభ సహకారం పట్ల ప్రశంసలు వ్యక్తంచేశారు" అని ప్రకటన తెలిపింది
"దేశంలోని సామాజిక-రాజకీయ పరిస్థితిపై, ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, సమగ్ర మానవ అభివృద్ధి మరియు మత స్వేచ్ఛతో సహా పరస్పర ఆసక్తి ఉన్న అంశాలపై అభిప్రాయాల వ్యక్తపరచడంతో సమావేశం ముగిసింది.