ఘనంగా నెల్లూరు మేత్రాసన యువత సదస్సు
ఘనంగా నెల్లూరు మేత్రాసన యువత సదస్సు
నెల్లూరు మేత్రాసనం, పరిశుద్ధ జపమాల మాత దేవాలయం, వియన్ని హోమ్ లో రెండు రోజల మేత్రాసన యువత సదస్సు ఘనంగా జరిగింది. యువత డైరక్టర్ ఫాదర్ ఆర్ మైఖేల్ గారి అద్వర్యం లో ఈ వేడుకలు జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిధులుగా నెల్లూరు పీఠాధిపతులు మహా పూజ్య యం.డి. ప్రకాశం గారు మరియు నెల్లూరు మేత్రాసన సహవారస పీఠాధిపతులు మహా పూజ్య పిల్లి ఆంథోనీ దాస్ గారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రేరణ యూత్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ జోజి తంబి గారు, డాక్టర్ సురేష్ బాబు గారు, ఇతర మేత్రాసన గురువులు పాల్గొన్నారు. యువతను ప్రభుయేసుని మార్గంలో నడవాలని, శోధనలో పడకుండా ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని ఫాదర్ జోజి తంబి గారు అన్నారు.
అధికసంఖ్యలో మేత్రాసన యువత ఈ సదస్సులో పాల్గొన్నారు. జాతీయ యువత కోఆర్డినేటర్ మెరుగు ప్రశాంత్, రీజినల్ యూత్ ప్రెసిడెంట్ యం గౌతమ్ , విజయవాడ మేత్రాసన యువత నాయకుడు మనోజ్ కుమార్ మరియు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"ది ఛోసెన్" (The Chosen) ను ప్రతి ఒక్కరు చూడాలని , ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని జీవితం ఆధారంగా నిర్మించారని తెలుగు రాష్ట్రాల జాతీయ యువత కోఆర్డినేటర్ మెరుగు ప్రశాంత్ కుమార్ తెలిపారు.
Article and Design By
M kranthi swaroop