ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గా గుర్తింపు పొందిన గురుశ్రీ డా. జోజిరెడ్డి SJ

హైదరాబాద్ అగ్రపీఠం, అల్వాల్ లోని జేసుసభ సంస్థ అయిన లయోలా అకాడమీ ప్రధానోపాధ్యాయులు గురుశ్రీ డాక్టర్ ఎల్. జోజి రెడ్డి ఎస్.జె. ప్రొఫెసర్గా అరుదైన ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించారు. 

ఆదివారం జులై 7  ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ దానకిశోర్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించగా, యూనివర్సిటీ ఇంటర్వ్యూ ప్యానల్ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. 

డాక్టర్ జోజిరెడ్డి గారు తన  విద్యాభ్యాస ప్రస్థానంలో ఇప్పటికే మూడు అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలతో పాటుగా ఎం.ఎస్సీ బయోటెక్నాలజీ, ఎం.బీ.ఎలకు సంబంధించి పోస్టు గ్రాడ్యేయేట్లను సాధించారు. 

2000 సంవత్సరంలో భారతీదాసన్ యూనివర్సిటీ నుంచి M.PHIL పూర్తిచేయగా, బయోటెక్నాలజీలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి 2010లో పిహెచ్ పట్టాను పొందారు. ఈ నేపథ్యంలో లయోలా సంస్థల్లో విభిన్న హోదాల్లో జోజిరెడ్డి  గారు తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.

2021 నుంచి వైస్ ప్రిన్సిపల్, డైరెక్టర్, చీఫ్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, స్పోర్ట్స్ డైరెక్టర్, లయోలా అకాడమీ సెక్రటరీగా విభిన్న తరహా విధులను సమర్ధవంతంగా అంకితభావంతో గురుశ్రీ జోజెరెడ్డి గారు నిర్వర్తిస్తూ వస్తున్నారు. 

2023లో వాటికన్ సిటీ కేంద్రంగా సౌత్ ఏషియాకు సంబంధించి ఉన్నత విద్యపై డాక్టర్ జోజిరెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని తన ఉపన్యాసాన్ని అందజేయడం విశేషంగా పేర్కొంటారు.

ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఉస్మానియా యూనివర్సిటీ వారు గురుశ్రీ జోజిరెడ్డిని ప్రొఫెసర్ గా ఉన్నతమైన గౌరవాన్ని అందజేయడం జరిగింది.

ఫాదర్ గారికి అమృతవాణి రేడియో వెరితాస్ ఆసియా తెలుగు విభాగం వారి తరపున శుభాకాంక్షలు.