పునీతుల విశ్వాసబాటను అనుసరించమన్న పోప్ లియో

19 అక్టోబర్ వేదవ్యాపక ఆదివారం నాడు సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో ధన్యులైన ఏడుగురిని పోప్ లియో పునీతులుగా ప్రకటించారు.
Venezuela కి చెందిన Carmen Rendiles, Italy కి చెందిన Bartolo Longo,Turkey కి చెందిన Ignatius Choukrallah Maloyan,Papua New Guinea కి చెందిన Peter To Rot ,Italy కి చెందిన మరో ఇద్దరు Maria Troncatti మరియు Vincenza Maria Poloni లను పునీతులుగా ప్రకటించారు.
ఈ పునీతులు దేవుని కృపతో విశ్వాస దీపాన్ని వెలిగించుకుని, ఆ క్రీస్తు వెలుగును వ్యాపింపజేయగల వారిగా మారారు అని పోప్ అన్నారు
మన ప్రపంచంలోని గొప్ప "భౌతిక, సాంస్కృతిక, శాస్త్రీయ మరియు కళాత్మక సంపదలను" తక్కువ అంచనా వేయకూడదని పోప్ అన్నారు, కానీ విశ్వాసం లేకుండా వాటి నిజమైన అర్థం కూడా పోతుందని గుర్తు చేసారు
విశ్వాసం లేని ప్రపంచం, తండ్రి లేని పిల్లల వంటిది. కనుక దేవునితో మన ప్రేమ బంధం స్థిరంగా ఉండటానికి మరియు మోక్షం కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించమని ప్రభువు మనల్ని ఆహ్వానిస్తున్నాడు అని పోప్ అన్నారు