COP30కి వీడియో సందేశాన్ని పంపిన పోప్ లియో

బ్రెజిల్‌లో COP30 లో పాల్గొన్న గ్లోబల్ దక్షిణ పీఠాధిపతులు మరియు కార్డినల్స్‌కు పోప్ లియో  ఒక వీడియో సందేశాన్ని పంపారు

ప్రణాళికలను మాటలలో కాకుండా చేతలలో చూయించాలని పోప్ హితవు పలికారు 

COP30 తన చర్చా సమయాన్ని దక్షిణ ప్రపంచ దేశాల కొరకు కేటాయించారు, కథోలిక  శ్రీసభ దీనికి మినహాయింపు కాదు.

ఆసియా, ఆఫ్రికా ,లాటిన్ అమెరికా మరియు కరేబియన్ దేశాలకు కార్డినల్స్ ప్రాతినిధ్యం వహించారు.

పోప్ లియో గ్లోబల్ దక్షిణ ప్రజలకు తన సాన్నిహిత్యాన్ని వీడియో సందేశం ద్వారా వ్యక్తపరిచారు 

నవంబర్ 17న, రెండవ వారం మొదటి రోజు ముగిసే సమయానికి, పోప్ లియో కూడా అమెజాన్‌లో ఉన్నారు.

“మీరు నిరాశకు బదులుగా ఆశను ఎంచుకున్నారు, కలిసి పనిచేసే ప్రపంచ సమాజాన్ని నిర్మించారు” అని పోప్ లియో అమెజోనియాస్ మ్యూజియంలో సమావేశమైన పీఠాధిపతులను ఉద్దేశించి అన్నారు 

వరదలు, కరువులు, తుఫానులు మరియు ఎడతెరిపి లేని వేడిలో ఎంతోమంది దుఃఖిస్తున్నారు,"ఈ వాతావరణ మార్పుల కారణంగా ఎందరో దుర్బల పరిస్థితుల్లో  జీవిస్తున్నారు" అని పోప్అన్నారు.

వారికి, వాతావరణ మార్పు సుదూర ముప్పు కాదు, మరియు ఈ ప్రజలను విస్మరించడం అంటే మనం మానవత్వాన్ని తిరస్కరించడమే.

ఈ అమెజానిక్ మ్యూజియం విభజన మరియు తిరస్కరణ కంటే మానవత్వం ,సహకారాన్ని ఎంచుకున్న ప్రదేశంగా గుర్తుండిపోవాలి అని పోప్ ముగించారు